Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయ అర్జనలో అక్షయ్ టాప్ : ఆరేళ్ళలో రూ.1700 కోట్లు

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (12:26 IST)
బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ మరోమారు వార్తలకెక్కారు. కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన పీఎం కేర్ ఫండ్‌కు ఏకంగా రూ.25 కోట్లను విరాళంగా ఇచ్చారు. దీనిపై ఆయన భార్య అభ్యంతరం చెప్పినా... ఏమాత్రం లెక్కచేయలేదు. ఈ క్రమంలో తాజాగా ఆయన మరోమారు వార్తల్లో నిలిచారు. ఆదాయ అర్జనలో అగ్రస్థానంలో నిలిచారు. గత ఆరేళ్ళ కాలంలో ఏకంగా 1744 కోట్ల రూపాయలను అర్జించినట్టు వెల్లడైంది. ఒక్క 2019 సంవత్సరంలోనే ఆరు సినిమాలతోపాటు ప్రమోషన్ల ద్వారా రూ.459.22 కోట్ల సంపాదించినట్టు ఫోర్స్బ్ పత్రిక వెల్లడించింది. 
 
నిజానికి బాలీవుడ్‌లోని సీనియర్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఒక ఏడాదికి దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తున్నాడు. ఒక్కో సినిమాకు రూ.వంద కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తూ అదే రేంజ్‌లో సంపాదిస్తున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే అక్షయ్ సంపాదన భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గత ఆరేళ్లలో అక్షయ్ భారీగా ఆర్జించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. 
 
ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం.. గత 6 సంవత్సరాలలో అక్షయ్ సంపాదన దాదాపు రూ.1,744 కోట్లు అని తేలింది. ఇందులో 2015లో రూ.208.42 కోట్లు, 2016లో రూ.211.58 కోట్లు, 2017లో రూ.231.06 కోట్లు, 2018లో రూ.277.06 కోట్లు, 2019లో రూ.459.22 కోట్లు, 2020లో రూ.356.57 కోట్లు చొప్పున అర్జించినట్టు ఆ పత్రిక అంచనా వేసింది. ఇకపోతే, ప్రస్తుతం అక్షయ్ చేతిలో ఏడు చిత్రాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments