ఇటీవల రషీద్ సిద్ధిఖీ అనే యూట్యూబర్‌కు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పరువు నష్టం నోటీసును పంపించారు. మొత్తం రూ.500 కోట్లకు ఈ పరువు నష్టం దావా వేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తనపై అసత్య ఆరోపణలు చేసి, తన పరువుకు భంగం కలిగించారంటూ పేర్కొంటూ అమీర్ ఖాన్ నోటీసు పంపించారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
బాలీవుడ్ హీరో నోటీసుకు యూట్యూబర్ ధీటుగానే స్పందించారు. అక్షయ్ కుమార్ తన పరువునష్టం ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా అక్షయ్ కుమార్‌కు నోటీసులు పంపాడు.
హీరో అక్షయ్ కుమార్ తన గురించి, తన యూట్యూబ్ చానల్ ఎఫ్ఎఫ్ న్యూస్ గురించి చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని రషీద్ స్పష్టం చేశాడు. తనను ఎదగనివ్వకుండా చేసేందుకే నోటీసులు పంపారని ఆరోపించాడు.
ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుందని, రషీద్ సిద్ధిఖీ యూట్యూబ్ వీడియోల్లో అభ్యంతరకర విషయాలు లేవని అతడి తరపు న్యాయవాది నోటీసుల్లో వివరించారు.