Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియల్ హీరో సోనూసూద్ అదుర్స్.. సూపర్ స్టార్లనే వెనక్కి నెట్టేశాడు.. (video)

Advertiesment
Sonu Sood
, మంగళవారం, 24 నవంబరు 2020 (13:18 IST)
బాలీవుడ్‌ సూపర్ స్టార్లు షారుఖ్‌ ఖాన్, అక్షయ్ కుమార్‌ను వెనక్కినెట్టాడు.. రియల్ హీరో సోనూ సూద్. సోషల్‌ మిడియా అనలైటికల్‌ సంస్థ ప్రకటించిన అక్టోబర్‌కు సంబంధించిన నివేదికలో.. అన్ని విభాగాల్లో కలిపి సోనూ నాలుగో స్థానంలో ఉన్నాడు. కరోనా సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించడమేగాక.. ఎంతోమంది నిస్సహాయులకు చేయూతనిచ్చి రియల్‌ హీరోగా మారాడు నటుడు సోనూసూద్‌. 
 
ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రోగస్థులు.. ఇలా ఎంతోమందికి సాయంగా నిలబడ్డాడు. చాలామందిలో స్ఫూర్తి రగిలించాడు. అందుకే ప్రజలు ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకొని దేవుడిలా పూజిస్తున్నారు. అంతేకాదు.. వీధుల్లో విగ్రహాలు ప్రతిష్ఠించారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం సోనూ సేవలకు మెచ్చి పంజాబ్‌కు ఐకాన్‌గా ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ రియల్‌ హీరో మరో ఘనత సాధించాడు. కష్టకాలంలో పేదలను ఆదుకున్న వారి జాబితాలో సోనూసూద్‌ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ విషయంలో బాలీవుడ్‌ సూపర్ స్టార్లను వెనక్కి నెట్టాడు. అంతేకాదు.. సోషల్‌ మీడియా అనలైటికల్‌ సంస్థ ప్రకటించిన అక్టోబర్‌కు సంబంధించిన నివేదికలో.. అన్ని విభాగాల్లో కలిపి సోనూ నాలుగో స్థానంలో ఉన్నాడు.
 
అంటే.. రాజకీయాలు, జర్నలిజం, వ్యాపారం, క్రీడలు, సినిమాలు, సాహిత్యం ఇలా అన్ని రంగాల్లో కలిపి టాప్‌ సెలిబ్రిటీస్‌ ఎవరని శోధించగా.. సోనూ అందులోనూ చోటు దక్కించుకున్నాడు. అగ్రస్థానంలో మోదీ, రెండో స్థానంలో రాహుల్‌ గాంధీ, మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ ఉండగా..2.4 మిలియన్ల ప్రస్తావనలతో నాలుగో స్థానంలో సోనూసూద్‌ ఉన్నాడు. 
 
సోనూసూద్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.8 మిలియన్లు, ట్విటర్లో 4.7మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 3.7మిలియన్ల ఫాలోవర్లున్నాయి. ఆయనను షారుక్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ వంటి ప్రముఖులు కూడా అనుసరిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ముద్రను చెరిపేసిన హీరోను తక్కువ చేసి మాట్లాడిన జిగేల్ రాణి (video)