Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ ప్రైజ్ మనీ ఎంత? విన్నర్‌గా ఎంత గెలుచుకున్నాడు?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (11:07 IST)
Nag_Sunny
బిగ్ బాస్ ఐదో సీజన్ విజేతగా నిలిచిన సన్నీ రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీని సంపాదించాడు. అయితే, అతడికి మాత్రం రూ. 34.40 లక్షలు మాత్రమే చేతికి వచ్చిందని తెలిసింది. దీనికి కారణం ఏదైనా షోలో 10 వేల కంటే ఎక్కువ గెలిస్తే 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే అతడికి దక్కిన రూ. 50 లక్షల్లో.. రూ. 15.60 లక్షలు ఆదాయపు పన్ను శాఖకు వెళ్లిపోతుంది. దీంతో సన్నీ ప్రైజ్‌మనీలో రూ. 34.40 మాత్రమే అందుకుంటాడు.  
 
దీనితో పాటు సువర్ణ భూమి వాళ్ల తరపు నుంచి రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్ కూడా దక్కింది. అలాగే, దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన ఓ అపాచీ స్పోర్ట్స్ బైక్‌ను కూడా సన్నీ గెలుచుకున్నాడు. ఇవన్నీ కలిపితే అతడు రూ. 78 లక్షలు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
 
విజే సన్నీ గురించి..
ఖమ్మం జిల్లాకు చెందిన వీజే సన్నీ.. జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించాడు. ఆ తర్వాత వీడియో జాకీగా మారాడు. అనంతరం సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక, కొన్ని సినిమాల్లోనూ నటించాడు. ఇలా ఈ సీజన్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 
 
ఇక, పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా సన్నీకి షో నిర్వహకులు వారానికి రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని తాజాగా తెలిసింది. అంటే అతడు హౌస్‌లో పదిహేను వారాల పాటు కొనసాగాడు. దీని ద్వారా మొత్తం ముప్పై లక్షల రూపాయలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments