Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్... గంగవ్వ కోసం చూసేవాళ్లే ఎక్కువ.. సోహెల్-హారిక ముచ్చట్లు..! (Video)

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (11:32 IST)
బిగ్ బాస్ సీజన్ మొదలైంది. అయితే బిగ్ బాస్ షో ప్రేక్షకులు ఆశించనంతగా ఆకట్టుకోలేకపోతుంది. అదికాక హౌస్‍‌లో ఉన్న వాళ్ళ గొడవలు ఏడుపులు గ్లామర్ షో బిగ్ బాస్ పైన ఆసక్తిని తగ్గిస్తున్నాయి. కేవలం గంగవ్వ కోసం చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి పర్లేదు. అయితే ఇన్నిరోజులు చప్పగా సాగిన బిగ్ బాస్ ఇప్పుడు ఊపందుకుంది.
 
రెండు ఎలిమినేషన్స్ తర్వాత ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ పెట్టిన నామినేషన్ ప్రక్రియతో బిగ్ బాస్‍లో కాక రేగింది. మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. కళ్యాణి వెళుతూ బిగ్ బాంబ్ దేవిపై వేయడంతో ఆమె డైరెక్ట్‌గా నామినేషన్‌లోకి వెళ్ళింది. 
 
ముందు అరియానా సోహెల్‌ల గొడవ.. హారిక దివిల ముచ్చట్లు చూపించారు. ఆ తర్వాత ఎలిమినేషన్ పక్రియ ప్రారంభం అయ్యింది. ఇక కెప్టెన్ అయిన నోయల్‌కు ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు.
 
దాంతో లాస్యను నోయల్ నామినేట్ చేశాడు. నోయల్ కెప్టెన్ అవ్వడం వల్ల ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. మిగిలిన వారిలో నుండి అందరు వచ్చి ఎవరిని ఎలిమినేషన్‌కు నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఫొటోలను మంటల్లో వేయాల్సి ఉంటుంది. మెహబూబ్ తనను సిల్లీ రీజన్‌తో నామినేట్ చేసాడని హారిక తెగ ఫీలైంది. 
 
అతను తన ఇగోను హర్ట్ చేశాడంటూ పేర్కొంది. ఎక్కువమంది కుమార్ సాయి ఫొటోను మంటల్లో వేశారు. ఆయన ఇంకా కలవడం లేదు అని చెప్పుకొచ్చారు. అలాగే మెహబూబ్, మోనాల్‌లకు కూడా ఎక్కువ మంది ఎలిమినేషన్‌కు ఓటు వేశారు. అలా మొత్తంగా ఈ వారంలో ఏడుగురు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments