Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గంగవ్వకు అలా క్రేజ్ తలుపు తట్టింది.. బిగ్ బాస్‌4లో ఆన్‌లైన్ మద్దతు.. (video)

గంగవ్వకు అలా క్రేజ్ తలుపు తట్టింది.. బిగ్ బాస్‌4లో ఆన్‌లైన్ మద్దతు.. (video)
, శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:09 IST)
గంగవ్వలోని తెలంగాణ గడుసుతనాన్ని..యాసను. భాషను ఒడిసిపట్టింది ఓ టీవీ షో. మట్టిలోని మాణిక్యాన్ని వెలికితీసి, ప్రపంచపు నలుమూలలకు పరిచయం చేసింది. ఐదేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముదుసలి వాళ్లు సైతం గంగవ్వ అంటే తెలియని వారు లేరు. కష్టాల కడలిని దాటుకుంటూ లంబాడిపల్లి నుంచి బిగ్‌బాస్‌ షో వరకు వెళ్లిన బహుదూరపు బాటసారి గంగవ్వ. 
 
మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగవ్వ బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె నామినేషన్‌ కోసం వేలాదిమంది ఇతర దేశాల్లోని అభిమానులు, స్థానికులు, తెలంగాణ భాషా ప్రేమికులు ఆన్‌లైన్‌ ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
తెలంగాణ సంప్రదాయం.. కట్టు.. బొట్టు.. అమాయకత్వానికి నిదర్శనంగా నిలిచిన గంగవ్వ ఫొటో వాట్సాప్‌ స్టేటస్‌లలో, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. గంగవ్వను గెలిపించేందుకు యూట్యూబ్‌ గంగవ్వ ఫాలోవర్స్‌ తపన పడుతున్నారు. విదేశాల్లోని తెలుగు వారుసైతం తమతోపాటు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులుసైతం ఓటు వేస్తున్నారు.
 
లంబాడిపల్లికి చెందిన ఎంటెక్‌ విద్యార్థి శ్రీరాం శ్రీకాంత్‌ పల్లె సంస్కృతిని, సంప్రదాయాలను పల్లెల్లోని అనుబంధాలు, ప్రేమలు, పండుగలు ప్రపంచానికి చాటి చెప్పేందుకు 2012లో మై విలేజ్‌ షో ఛానల్‌ ప్రారంభించాడు. ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతమైన లంబాడిపల్లిలోని పచ్చని పొలాలు, పండుగలను యూట్యూట్‌లో అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించాడు.
 
తన ఇంటి పక్కనే ఉన్న గంగవ్వతోపాటు స్థానికులతో షార్ట్‌ మూవీస్‌లో నటింపజేశారు. సుమారు 200 షార్ట్‌ మూవీస్‌లో నటించింది. గంగవ్వ అమాయకత్వం.. తెలంగాణ తిట్లు.. భాష.. యూట్యూబ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పల్లె ప్రజల్లో ఇంటి మనిషిగా మారిపోయింది. ఇక వెనకకు తిరిగిచూడలేదు. గంగవ్వకు ఫాలోవర్స్‌ పెరిగిపోయారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగనా రనౌత్ ఒక్క సినిమాలో నటించి రాణి లక్ష్మీ‌బాయ్‌ని అనుకుంటే ఎలా?