Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ 13వ సీజన్.. టాస్క్‌ల్లేవ్.. కానీ గొడవలు మాత్రం..?

Advertiesment
బిగ్ బాస్ 13వ సీజన్.. టాస్క్‌ల్లేవ్.. కానీ గొడవలు మాత్రం..?
, గురువారం, 10 సెప్టెంబరు 2020 (17:32 IST)
Bigg Boss Telugu 4
బిగ్ బాస్ 13వ సీజన్‌లో టాస్క్‌లు ప్రారంభం కాకముందే గొడ‌వ‌లు, ఏడుపులు స్టార్ట్ అయ్యాయి. ఇక నేటి నుంచి బిగ్‌బాస్ శారీర‌క టాస్క్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశాడు. ఇందుకోసం కంటెస్టెంట్లను టీమ్స్‌గా ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఒకరినొక‌రు తోసుకుంటూ మొద‌టి టాస్క్‌లోనే కంటెస్టెంట్లు త‌మ ప్ర‌తాపం చూపించిన‌ట్లు కనిపిస్తోంది. ఈ మేర‌కు స్టార్ మా ప్రోమోను విడుద‌ల చేసింది. 
 
ఈ టాస్క్‌లో పాల్గొన్న ఇంటి స‌భ్యులు చేతుల‌తోనే ట‌మాటాలు పిసికి జ్యూస్ చేశారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు ఎక్కువ బాటిళ్లు నింపాల‌ని త‌హ‌త‌హ‌లాడారు. అయితే ఈ టాస్క్‌లో గంగ‌వ్వ ఎక్క‌డా పాల్గొన్న‌ట్లు క‌నిపించ‌లేదు. ఆమె ప్ర‌త్యేకమ‌ని నాగార్జునే చెప్పాడు కాబ‌ట్టి బిగ్‌బాస్ కూడా ఈ టాస్క్‌లో ఆమెకు మిన‌హాయింపు ఇచ్చారో, లేదా ఆడించారో నేటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. 
 
అలాగే స్టార్ మా విడుద‌ల చేసిన మ‌రో ప్రోమోలో దివి, సూర్య కిర‌ణ్ మ‌ధ్య గొడ‌వ మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ మూడు రోజుల్లో త‌ను కంటెస్టెంట్ల‌ను ఏ మేర‌కు ప‌రిశీలించో చెప్పుకొచ్చింది. మోనాల్‌.. ఊరికే ఏడుస్తుంద‌ని, లాస్య సెన్సిటివ్ అని చెప్పింది. 
 
సూర్య‌.. నా మాటే విను అన‌డం త‌గ్గించుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికింది. దీంతో సూర్య కిర‌ణ్ కోపం న‌షాళాన్ని తాకింది. తాను త‌గ్గించుకోన‌ని తేల్చి చెప్పాడు. దీంతో హౌస్‌లో మ‌రోసారి అగ్గి రాజేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. అస‌లు దివికి, సూర్య‌కిర‌ణ్‌కు మ‌ధ్య నిజంగానే గొడ‌వ జ‌రిగిందా? లేదా అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగత్ సింగ్‌లా నడుచుకుంటున్నావ్.. నీ గట్స్‌కు హ్యాట్సాప్.. విశాల్