Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ నాలుగో సీజన్‌.. తడిసిన అందాలతో డ్యాన్స్.. రికార్డ్ డ్యాన్స్‌లా సాగిన..?

Advertiesment
బిగ్ బాస్ నాలుగో సీజన్‌.. తడిసిన అందాలతో డ్యాన్స్.. రికార్డ్ డ్యాన్స్‌లా సాగిన..?
, మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:42 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో భాగంగా శనివారం నాటి ఎపిసోడ్‌ నోటిపై వేలేసుకునేలా వుంది. అసలే ఆ కంటెస్టెంట్లు ఎవరో అర్థం కాక.. వాళ్ల ఓవరాక్షన్ తట్టుకోలేక జనం గగ్గోలు పెడుతుండటంతో శనివారం నాటి ఎపిసోడ్‌కి కాస్త గ్లామర్ టచ్ ఇచ్చారు. దివి, మొనాల్ గజ్జర్, అరియానా, దేత్తడి హారిక లాంటి హాట్ బ్యూటీలు హౌస్‌లో ఉండటంతో వారి తడి తడి అందాలతో కనిపించారు. బిగ్ బాస్ హౌస్‌కి రెయిన్ ఎఫెక్ట్ ఇచ్చారు. 
 
ఎన్నాళ్ల గుర్తొచ్చానా వాన అంటూ సాంగ్ ప్లే చేయడంతో.. అరియానా, దివి, యాంకర్ దేవి, హారికలు వర్షంలో తడుస్తూ స్టెప్పులతో రచ్చ చేశారు. తడి అందాల ప్రదర్శన చేస్తూ హాట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక దివి అయితే స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి అందాల సోయగం చేసింది. ఇక మగాళ్లైతే అర్థనగ్న ప్రదర్శన చేస్తూ బుల్లి బుల్లి చెడ్డీలతో అందాల భామలతో కలిసి రచ్చ చేశారు.
 
ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేయగా.. కింగ్ నాగార్జున ఒక్కో జంటను పిలుస్తూ మాస్ స్టెప్పులతో రచ్చ చేయించారు. సండే ఫన్ డే అంటూ రాములో రాములో స్టెప్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. కంటెస్టెంట్స్‌కి ఫన్నీ టాస్క్ ఇచ్చి వాళ్లతో డాన్స్‌లు చేయిస్తున్నారు.
 
ఇక అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సిటీ మార్ పాటకు చీరతోనే మాస్ స్టెప్పులు వేసి రచ్చ చేసింది టీవీ 9 యాంకర్ దేవి. ఈమెకు అభిజిత్ తోడు కలవడంతో బిగ్ బాస్ హౌస్‌ను ఊపేసింది దేవి. ఇక నక్కిలీసు గొలుసు సాంగ్‌కి యాంకర్ లాస్య, సూర్య కిరణ్‌లు ఊరమాస్ స్టెప్పులేశారు.
 
ఇక జిగేల్ రాణి పాటకు మొనాల్.. మొహబూబ్‌తో కలిసి రచ్చ చేసింది. ఇక చివర్లో అమ్మడు లెడ్స్ డూ కుమ్ముడు అంటూ రంగవ్వ కూడా రాజశేఖర్ మాస్టర్‌తో కలిసి హౌస్‌లో సందడి చేస్తోంది. మొత్తానికి రికార్డింగ్ డాన్స్‌ని తలపించింది.. ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్.
 
ఆదివారం నాటి ఎపిసోడ్ అంతా ఫుల్ జోష్‌తో నడిచింది. బిగ్ బాస్ హౌస్ అందగత్తెల ఆట పాటలతో సందడిగా మారగా.. దర్శకుడు సూర్య కిరణ్ తొలివారంలోనే ఎలిమినేట్ అయ్యి ఇంటి ముఖం పట్టారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ‘ఈరోజుల్లో’ ఫేమ్ కుమార్ సాయి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 
 
సోమవారం నాటి 9వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. అఖిల్ సిద్దార్థ్, మొనాల్ గజ్జర్‌లు వంటగదిలో బిజీ అయ్యారు. ఒకర్ని ఒకరు పొగుడుకుంటూ మెల్ల మెల్లగా బిగ్ బాస్ హౌస్‌లో ఏదో కథ మొదలవ్వబోతుందని ముందే హింట్ ఇచ్చారు. 
 
మొనాల్ తన కోసం పాట పాడాలని అఖిల్‌ని కోరగా.. అఖిల్ రాగం అందుకోవడంతో తెగ సిగ్గుపడిపోతూ అతనికి దిష్టితీసేసింది మొనాల్. దీంతో అఖిల్ కూడా తెగ పొంగిపోయాడు. అనంతరం బిగ్ బాస్ కెమెరాల ద్వారా మొనాల్ తన తల్లికి అఖిల్‌ని పరిచయం చేసింది.
 
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన కుమార్ సాయి ఇంటి సభ్యుల్ని సర్ ప్రైజ్ చేసేందుకు ప్రయత్నించాడు. మొదటి యాంకర్ దేవి, దివిలు అతన్ని పసిగట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఫిక్స్ అయ్యారు. దీంతో కుమార్ సాయి ఎంట్రీ సాదాసీదాగానే జరిగింది. 
 
మొత్తానికి సోమవారం ఎపిసోడ్‌లో మొనాల్-అఖిల్-అభిజిత్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో పాటు.. నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఇక వరుసగా రెండో వారం కూడా గంగవ్వ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యింది. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరప్పణ అగ్రహార జైలుకు రాగిణి ద్వివేది - సీసీబీ కస్టడీకి సంజనా