Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునర్నవి బాయ్‌ఫ్రెండ్ వున్నాడని చెప్పడంతో వదిలేశా?! (video)

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (13:20 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. ఈ రియాల్టీ షోలో సింగర్ రాహుల్ విజేతగా నిలిచాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ విజేతగా నిలిచిన ఆనందాన్ని పండగలా చేసుకుంటున్నాడు. బిగ్ బాస్-3 రియాల్టీ షో ముగిసిన తరువాత విజేతగా నిలిచిన రాహుల్ ఫుల్ జోష్‌లో మునిగి తేలుతున్నాడు. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫుల్ పార్టీ చేసకున్నాడు. రాహుల్ పార్టీలో వరుణ్, వితికలతో పాటు.. పునర్నవి కూడా పాల్గొంది. 
 
రాహుల్ సిప్లిగంజ్ పార్టీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియలో ట్రెండింగ్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో ఈ నలుగురు ఓ గ్యాంగ్‌గా ఏర్పడి చివరి వరకు తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. ఇక రాహుల్, పునర్నవి మధ్య లవ్ ఉందంటూ గాసిప్స్ వచ్చిన వార్తలు కూడా తెలిసిందే. హౌస్‌ నుంచి బయటకొచ్చిన తర్వాత పునర్నవి.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చింది. రాహుల్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే రాహుల్ సెలబ్రేషన్స్‌లో పునర్నవి కనిపించడం అతని అభిమానులతో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇకపోతే.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో పునర్నవిని నీ ఇష్టమైన ఫైనల్ కంటెస్టెంట్ ఎవరు? అని అడిగారు నాగార్జున. దీని సిగ్గు మొగ్గలైన పునర్నవి.. ‘నాగార్జున గారో.. ఎవర్ని పట్టుకుని ఏం అడుగుతున్నారు మీరు తెలియదా? అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇస్తూ.. రాహల్ అని చెప్పకనే చెప్పింది. బిగ్ బాస్ షో‌తో తన జీవితం మొత్తం మారిపోయింది. క్షణం తీరిక లేకుండా ఉంది. చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది.
 
ఇకపోతే.. బిగ్ బాస్ విజేతగా నిలిచిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. తన వృత్తిని మానుకోనని చెప్పాడు. బార్బర్ వృత్తిని కొనసాగిస్తానని.. బిగ్ బాస్‌ ద్వారా వచ్చిన ధనంతో బార్బర్ షాపు పెడతానని తెలిపాడు. బిగ్ బాస్ హౌస్‌లో పునర్నవి తనకు బాగా సపోర్ట్ చేసిందని, ఆమెతో పాటు హౌస్‌లో వున్న వారందరితో తనకు మంచి బాండింగ్ వుందని చెప్పుకొచ్చాడు. చిన్న చిన్న గొడవలు వచ్చినా అవి గేమ్‌కే పరిమితం అన్నాడు. 
 
అలాగే పునర్నవి గురించి మాట్లాడుతూ.. ఇక పున్నును ఎప్పుడైనా డేటింగ్‌కు పిలిచారా అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చాడు. పున్నును డేటింగ్‌కు పిలుద్దామని అనుకున్నానని.. కానీ ఆమెకు ఆల్ రెడీ బాయ్ ఫ్రెండ్ వున్నానని చెప్పడంతో వదిలేశాను అంటూ తెలిపాడు.
 
కానీ పున్ను తనకు బాగా సపోర్ట్ చేసింది. టాస్క్‌లు బాగా చేయకపోయినా కొట్టి మరీ వాటిని పూర్తి చేయించేది. లైఫ్‌లో ప్రాణ స్నేహితుడు ఎలా వుంటాడో.. అలా పున్ను తనకు ప్రాణ స్నేహితురాలు అంటూ రాహుల్ తెలిపాడు. ఫ్రెండ్ కంటే రెండు మెట్లు ఎక్కువేనని రాహుల్ వెల్లడించాడు. పున్నును తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోను అంటూ చెప్పుకొచ్చాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments