Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జునా..? సమంతా..?

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (18:50 IST)
స్టార్ మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ జీన్‌లో ఎన్టీఆర్ సందర్భానుసారంగా చేసిన వ్యాఖ్యానం బాగా ఆకట్టుకుంది. సెకండ్ సీజన్‌కి కూడా ఎన్టీఆరే హోస్ట్ అనుకున్నారు కానీ.. షూటింగ్‌లో బిజీగా ఉండటం వలన కుదరలేదు. దీంతో బిగ్ బాస్ సీజన్ 2కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు.
 
అయితే...సోషల్ మీడియాలో నాని హోస్ట్‌గా చేయడం గురించి కామెంట్స్ చేయడంతో ఎప్పుడు ఈ షో అయపోతుందా అని నాని ఎదురుచూసాడని విమర్శలు వచ్చాయి.
 
ఆ తర్వాత బిగ్ బాస్ 3కి ఎవరు హోస్ట్‌గా చేస్తారనుకుంటే... టాలీవుడ్ కింగ్ నాగార్జున రంగంలోకి దిగారు. ఆయన తనదైన శైలిలో యాంకరింగ్ చేసి అదరగొట్టేసారు. దీంతో నాగార్జున హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ 3 రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నాలుగవ సీజన్ రాబోతుంది.
 
మరి.. ఈసారి ఎవరు హోస్ట్‌గా ఉంటారు అంటే.. కొంతమంది పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ ఫైనల్‌గా మళ్లీ నాగార్జునే చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే... ఉన్నట్టుండి తెర పైకి సమంత పేరు వచ్చింది.
 
 ఈసారి సమంత బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది నిజమేనా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే... 
సమంత హోస్ట్‌గా చేయడం అనే వార్తలో వాస్తవం లేదని తెలిసింది. నాగార్జునే మళ్లీ బిగ్ బాస్ హోస్ట్‌గా రానున్నారని సమాచారం. ఆగష్టులో ఇది ప్రారంభం కానున్నట్టు టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments