క్వారంటైన్ సెంటర్‌కు అనుకోని అతిథి వచ్చింది. ఆ అతిథిని చూసి హడలిపోయారు. భయంతో పరుగులు తీశారు. ఇంతకీ ఏం జరగిందంటే..? క్వారంటైన్ సెంటర్‌కు కాలనాగు వచ్చింది. ఆరు అడుగుల పొడవున్న నాగుపాము ఆ క్వారంటైన్ సెంటర్లోకి వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు కానీ.. వెంటనే నిర్వాహకులు స్నేక్ హెల్ప్ నిర్వాహకులకు కాల్ చేశారు.
హుటాహుటిన బాలాకటి క్వారంటైన్ సెంటర్‌కు చేరుకున్న స్నేక్ హెల్ప్ సిబ్బంది ఆ పామును చాకచక్యంగా పట్టుకొని తీసుకెళ్లారు. అసలే కరోనాకు భయపడుతుంటే... ఇలా పాములు కూడా రావడం ఏంటని కరోనా పేషెంట్లు ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లో చోటుచేసుకుంది.
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అనుమానితులను క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లలో అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. 14 రోజులపాటు క్వారంటైన్ సెంటర్లో ఉంచుతున్నారు. టెస్టులు నిర్వహించి నెగెటివ్ వస్తే ఇంటికి పంపుతున్నారు.