షూటింగ్‌కు అనుమతివ్వండి.. కరోనాతో షూటింగ్‌లు ఆగిపోయాయి. సినిమాలు లేకుంటే క్రిందిస్థాయి వ్యక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా చిరంజీవి ఇంట్లో గత కొన్నిరోజుల ముందు ప్రభుత్వానికి.. సినీనటులకు జరిగిన చర్చ. సానుకూలంగా స్పందించిన సినిమాటోగ్రఫీ శాఖామంత్రి షూటింగ్ అనుమతికి ముఖ్యమంత్రితో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తానన్నారు.
ఇదంతా ఒకే. అప్పట్లో జరిగిన సమావేశానికి చిరంజీవి, నాగార్జున, అగ్రనిర్మాతలు మాత్రమే హాజరయ్యారు. కానీ బాలక్రిష్ణ మాత్రం ఆ సమావేశానికి హాజరు కాలేదు. బాలయ్యబాబును ఆ సమావేశానికి అస్సలు ఆహ్వానించలేదట. దీనిపై ఇప్పటికే బాలయ్యబాబు స్పందించారు. సినిమా మీటింగ్ కదా సిఎంతో మాట్లాడతానన్నారు.
ఒక అగ్రహీరోగా ఉన్న తనను ప్రభుత్వ, సినిమా పెద్దల సమావేశానికి పిలవకపోవడంపై బాలయ్యబాబు తెగ ఫీలయ్యాడు. దీంతో ఆయన నేరుగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి షూటింగ్ అనుమతిపై విజ్ఞప్తి చేయడానికి సిద్థమైనట్లు తెలుస్తోంది.
మొదట్లో జరిగిన సమావేశంలో కేవలం విజ్ఞప్తి మాత్రమే.. ఆ సమావేశానికి మంత్రి మాత్రమే వచ్చారు. కానీ తను ముఖ్యమంత్రినే కలిసి పర్మిషన్ వచ్చేలా చేస్తానంటున్నారు బాలయ్య బాబు. తనను సమావేశానికి పిలవకపోవడంపై ఇప్పటికే బాలక్రిష్ణ కోపంగా ఉన్నారనే వార్తలు వస్తూనే వున్నాయి. చిరంజీవి, నాగార్జున ఇలా ఎందుకు చేశారో బాలక్రిష్ణకు ఇప్పటికీ అర్థం కావడం లేదట.