Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భ‌ర‌త్ అనే నేను' క‌థ కొర‌టాల రాసింది కాదా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్ బస్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన "భ‌ర‌త్ అనే నేను" సినిమా ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. 'శ్రీమంతుడు' కాంబినేష‌న్ కావ‌డంతో ఈ సినిమాపై

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (12:04 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్ బస్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన "భ‌ర‌త్ అనే నేను" సినిమా ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. 'శ్రీమంతుడు' కాంబినేష‌న్ కావ‌డంతో ఈ సినిమాపై ప్రారంభం నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికితోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్ధాయిలో నిర్వ‌హించ‌డం.. దీనికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రు కావ‌డంతో ఈ మూవీ పై మ‌రింత క్రేజ్ పెరిగింది.
 
ఇదిలావుంటే... భ‌ర‌త్ అనే నేను క‌థ విష‌యంలో గ‌త కొన్ని రోజులుగా ఓ వార్త ప్ర‌చారంలో ఉంది. అది ఏమిటంటే... ఈ క‌థ కొర‌టాల రాసిన క‌థ కాద‌ని... డైరెక్ట‌ర్ శ్రీహ‌రి నాను రాసిన క‌థ అని టాక్ వినిపిస్తోంది. ఇదే విష‌యం గురించి కొర‌టాల‌ని అడిగితే... త‌న ద‌గ్గ‌ర ఓ పది క‌థ‌లు రెడీగా ఉన్నాయ‌ని... త‌న‌కు వేరే రైట‌ర్ ద‌గ్గ‌ర నుంచి క‌థ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పాడు. 
 
అయితే...  శ్రీహ‌రి నాను త‌న‌కు గ‌తంలో రూమ్‌మేట్, ఫ్రెండ్ అని.. అప్ప‌ట్లో హీరో ముఖ్య‌మంత్రి అయితే... అంటూ ఓ ఐడియా ఇచ్చాడ‌ని.. దానిని నేను డెవ‌ల‌ప్ చేసి క‌థ‌గా రాసాన‌ని చెప్పారు. ఐడియా ఇచ్చిన శ్రీహ‌రికి స్పెష‌ల్ థ్యాంక్స్ చెబుతూ టైటిల్స్‌లో వేస్తున్నామ‌ని చెప్పారు. అదీ... సంగ‌తి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments