Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీని పొట్టనబెట్టుకున్న బ్యానర్... నాకు కటౌట్స్, ఫ్లెక్సీలు వద్దన్న నటుడు సూర్య‌

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (20:20 IST)
స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు... అభిమానులు ఎంత హాడావిడి చేస్తారో అంద‌రికీ తెలిసిందే. థేయేట‌ర్ ద‌గ్గ‌ర బాణాసంచా కాల్చ‌డం... భారీ స్ధాయిలో క‌టౌట్ ఏర్పాటు చేయ‌డం.. ఆ క‌టౌట్‌కి పూలదండ వేయ‌డం.. ఇలా అభిమానులు చేసే హడావిడి అంతాఇంతా కాదు. 
 
హీరోలు కూడా అభిమానులు ఇలా చేస్తుండ‌డాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తమిళనాడులో అభిమానం డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే... తన కోసం ఎవరు కూడా కటౌట్స్ రెడీ చేయవద్దని సూర్య అభిమానులను కోరడం ఒక్కసారిగా కోలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అవును.. ఇప్పుడు కోలీవుడ్లో ఇదే హాట్ టాపిక్. 
 
ఓ విధంగా సూర్య తీసుకున్న నిర్ణయానికి అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. సూర్య నెక్స్ట్ సినిమా కాప్పాన్. ఈ మూవీ తెలుగులో బందోబస్త్ టైటిల్‌తో రిలీజ్ కానుంది. భారీగా రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో కొత్త సందడి నెలకొంది. భారీ కటౌట్స్ బ్యానర్స్‌తో అభిమానులు సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న సూర్య వారికి తన విన్నపాన్ని తెలియజేశాడు. 
 
నాకు కటౌట్స్, బ్యానర్స్ లాంటివి ఏమీ వద్దు. అవి నన్ను సంతృప్తి పరచవు. ఆ డబ్బుతో సేవా కార్యక్రమలకు ఉపయోగించండి అని సూర్య అభిమానుల‌ను కోరడంతో సోషల్ మీడియాలో సూర్య అభిమానులు అందుకు మద్దతు పలుకుతున్నారు. అంద‌రి హీరోల అభిమానులు ఇలా ఆలోచిస్తే బాగుంటుంది. కాగా గతవారం ఓ పార్టీ ఫ్లెక్సీ కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపధ్యంలో సూర్య తన చిత్రానికి కటౌట్లు, ఫ్లెక్సీలు వద్దని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments