Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్రంట్ ఆఫీస్ జాబ్.. ఆ ఫోటోలు పంపితేనే.. ఫిజిక్ ఎలా వుందో చెప్పగలం..?

ఫ్రంట్ ఆఫీస్ జాబ్.. ఆ ఫోటోలు పంపితేనే.. ఫిజిక్ ఎలా వుందో చెప్పగలం..?
, శనివారం, 24 ఆగస్టు 2019 (17:27 IST)
పేరుకే టెక్కీ.. కానీ కేటుగాడు.. ఫ్రంట్ ఆఫీసు ఉద్యోగం కోసం యువతులను బుట్టలో వేసుకుని వారిని వేధించేవాడు. ఇతని మాయలో 600 మంది అమ్మాయిలు పడి.. న్యూడ్ ఫోటోలు, డబ్బులు పంపారు. కానీ హైదరాబాదుకు చెందిన ఓ మహిళ ఇతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన ప్రదీప్ (33) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సైలెంట్‌గా తన జాబేదో తాను చేసుకోకుండా ఫేస్‌బుక్‌లో అర్చనా జగదీష్ పేరుతో ఓ అకౌంట్ తెరిచాడు. ఆమె ఓ కన్సల్టెన్సీ కంపెనీ హెచ్ఆర్ అని రాశాడు. 
 
ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే మెసేజ్ పంపమని చెప్పాడు. చాలా మంది అమ్మాయిలు, మహిళలు, యువతులు తమకు ఉద్యోగం కావాలని మెసేజ్‌లు పంపేవాళ్లు. వాళ్ల ఫోన్ నంబర్ తెలుసుకొని, కాల్ చేశేవాడు. అర్చనా జగదీష్ తాలూకా అని చెప్పేవాడు. 
 
ఇంటర్వ్యూ చేస్తున్నానంటూ మాయమాటలు మాట్లాడేవాడు. త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం ఇప్పిస్తానని వాళ్లను నమ్మించేవాడు. అలా వాళ్లతో కనెక్ట్ అయ్యేవాడు.
 
ఒక్కసారి అమ్మాయిలు తనకు కనెక్ట్ అవ్వగానే ఫ్రంట్ ఆఫీస్, రిసెప్షనిస్ట్ జాబ్‌ చెయ్యాలంటే అందంగా ఉండాలనీ, మంచి ఫిజిక్ మెయింటేన్ చేస్తూ వుండాలని.. న్యూడ్, ఇతరత్రా ఫోటోలు పంపితే ఫిజిక్‌పై సలహాలిస్తామని చెప్పాడు. ఇతడి మాటలు నమ్మిన కొందరు యువతులు మోసపోయారు. 
 
ఆపై ఆ ఫోటోలను నెట్లో పెట్టేస్తానని తనకు న్యూడ్ ఫోటోలు పంపిన అమ్మాయిలను ప్రదీప్ బెదిరించేవాడు. ఇలా 600 మంది అమ్మాయిలు ఇతని చేతిలో మోసపోయారు. చివరికి హైదరాబాదుకు చెందిన మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రదీప్ పోలీసులకు చిక్కాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యను చంపేయమన్న భర్త.. అత్యాచారానికి పాల్పడి ఉరేసిన..?