Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యను చంపేయమన్న భర్త.. అత్యాచారానికి పాల్పడి ఉరేసిన..?

Advertiesment
Man
, శనివారం, 24 ఆగస్టు 2019 (17:08 IST)
తాళికట్టి భార్యపై సుఫారీ ఇచ్చి మరీ హత్య చేశాడు.. ఓ భర్త. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మెదక్‌లోని హవేళిఘణనాపూర్ మండలం ఔరంగాబాద్ తండా పంచాయితీకి చెందిన ఓ వ్యక్తి కొద్దికాలం క్రితం బతుకు దెరువు కోసం సింగపూర్ వెళ్లాడు. భార్యను మాత్రం ఇక్కడే ఉంచి తాను మాత్రం వెళ్లాడు. భర్తలేని సమయంలో ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్యను మందలించాడు. కానీ ఆమె ప్రవర్తనను మార్చుకోలేదు. దీంతో.. ఎక్కడ ప్రియుడితో కలిసి తనను చంపుతుందో అనే భయంతో తాను భార్యను చంపాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో పదివేల రూపాయల సఫారీ ఇచ్చి భార్యను చంపేయమని పురమాయించాడు. భార్యను తీసుకొని సినిమాకి వెళ్లాడు. అక్కడ ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత ఓ చెట్టువద్దకు ఆమెను తీసుకువెళ్లి.. సుఫారీ ఇచ్చిన వారికి అప్పగించాడు. 
 
తాను మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వాళ్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమె చీరతోనే ఉరివేసి హత్య చేశారు. కాగా... భార్య చనిపోయిందన్న విషయం ఫోన్ ద్వారా తెలుసుకొని భార్య తనతోపాటు సినిమాకి వచ్చి తర్వాత ఎక్కడికో వెళ్లిందని నమ్మబలికాడు. రెండు రోజుల తర్వాత ఆమె శవమై కనిపించింది. 
 
ఏమీ ఎరగనట్టు భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు రోజుల్లో భర్తే హంతకుడని తేల్చి చెప్పారు. అతనిని, చంపిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కదులుతున్న రైలు నుంచి దిగింది.. అయితే ప్రాణాలతో?