Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కదులుతున్న రైలు నుంచి దిగింది.. అయితే ప్రాణాలతో?

Advertiesment
కదులుతున్న రైలు నుంచి దిగింది.. అయితే ప్రాణాలతో?
, శనివారం, 24 ఆగస్టు 2019 (16:25 IST)
కదులుతున్న రైలులో ఎక్కడం, దిగడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కానీ ఇలాంటి ఘటనలు ఎన్నే విషాదాన్ని మిగిల్చాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి దిగుతూ, కిందపడినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కదులుతున్న రైలు నుంచి వ్యతిరేక దిశలో ఆమె దిగేందుకు ప్రయత్నించింది. 
 
అనుకోకుండా ఆమె రైలు, ఫ్లాట్‌ ఫామ్‌కు మధ్యలో ఇరుక్కొని రైలుకిందకి జారిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమెకు ఏమై ఉంటుందోనని ఆందోళన చెందారు. 
 
అయితే రైలు వెళ్లిపోయిన అనంతరం స్వల్పగాయాలతో పట్టాలపైనుంచి ప్లాట్‌ఫాంపైకి చేరడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆండ్రాయిడ్ నుంచి కొత్త వెర్షన్.. ఇక ఫుడ్ ఐటమ్స్ పేర్లకు బై బై