పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆరుగురు భారత్‌లోకి ప్రవేశించినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతాగ శ్రీలంక నుంచి సముద్ర మార్గంలోని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ప్రవేశించినట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.
భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో ఓ పాకిస్థానీతోపాటు ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలు ఉన్నట్టు సమాచారం. వీరంతా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు తమిళనాడులోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ప్రార్థనాలయాలు, పర్యాటక ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాల్లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో సముద్ర తీరప్రాంతాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు.