ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

సెల్వి
శనివారం, 22 నవంబరు 2025 (10:25 IST)
నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో బాలకృష్ణతో పాటు ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.
 
గోవా వేదికగా జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకలో బాలకృష్ణను సత్కరించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన పలు మీడియా ఛానల్స్‌తో మాట్లాడుతూ, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వివరాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆదిత్య 369 సీక్వెల్‌గా ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో తన కొడుకుతో కలిసి నటించబోతున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 
ఈ విషయాన్ని బాలయ్య తెలిపిన వెంటనే నందమూరి అభిమానుల్లో భారీ హైప్ మొదలైంది. ఆదిత్య 999 మ్యాక్స్ వంటి పెద్ద కాన్సెప్ట్ ఉన్న సినిమాతో మోక్షజ్ఞ డెబ్యూ మంచి నిర్ణయమని అభిమానులు చెబుతున్నారు. ఈ చిత్రం మోక్షజ్ఞ కెరీర్‌కి మంచి ఆరంభం ఇవ్వొచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది త్వరలో తేలనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

బెట్టింగ్ యాప్స్ కేసు: నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖిల వద్ద విచారణ ఎలా జరిగింది?

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments