Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య - బోయపాటి కాంబినేషన్ టైటిల్ ఫిక్స్!

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (13:15 IST)
యువరత్న బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వర్కిగ్ టైటిల్ బీబీ-3 పేరుతో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తాజా సమాచారు. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో "సింహా", "లెజెండ్" వంటి చిత్రాలు రాగా, అవి సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.
 
ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే అనధికారికంగా ఈ సినిమాకు సంబంధించి పలు టైటిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
 
ఈ సినిమా టైటిల్‌ గురించి తాజాగా వెల్లడైన సమాచారం మేరకు.. 'గాడ్‌ ఫాదర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. బాలయ్య ఇమేజ్‌కు, కథకు ఈ టైటిలే సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం నిర్ణయించింది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. 
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను 'ఫస్ట్ రోర్' పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. ఆ వీడియోలో బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. రవీందర్ రెడ్డి నిర్మాణంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీయార్ జన్మదినోత్సవం సందర్భంగా మే 28న ఈ సినిమా విడుదల కాబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments