Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బూతు పురాణ మంత్రి నానికి ఆయనే సరైన మొగుడు...

బూతు పురాణ మంత్రి నానికి ఆయనే సరైన మొగుడు...
, బుధవారం, 20 జనవరి 2021 (20:06 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో కొడాలి నానికి ఓ పేరు వచ్చింది. అదే బూతు పురాణ మంత్రిగా ఆయనను ప్రతి ఒక్కరూ పిలుస్తున్నారు. ఆయన నోరు తెరిస్తే బూతులే తప్పా.. మంచి మాటలు రావు. ముఖ్యంగా, ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. రాసేందుకు వీలులోని పదజాలంతో దూషిస్తున్నారు.

అయినప్పటికీ ఆయనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే, అలాంటి బూతు పురాణ మంత్రికి సరైన మొగుడు ఆయనొక్కరేనంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఆ కరెక్టు మొగుడు ఎవరనే కదా మీ సందేహం... ఇంకెవరో కాదు టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. మంత్రి కొడాలి నానికి బాలయ్య ప్రత్యక్షంగా వార్నింగ్ ఇస్తుంటారు. అయినా మంత్రిగారు నోరు మెదపరు. దీనివెనుక ఉన్న పరమార్థం ఏంటో ఎవరికీ తెలియదు. 
 
నిజానికి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తర్వాత కొడాలి నాని నోటికి పని చెప్పారు. సీఎం జగన్ మెప్పు పొందడానికో, లేక తన మంత్రి పదవిని నిలబెట్టుకోడానికో తెలియదు గానీ మంత్రి తన రాజకీయ ప్రత్యర్థులపై శివాలెత్తుపోతున్నారు. ఇది ఇటీవల కాలంలో అధికమైంది. 
 
టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర ముఖ్య నాయకుల్లో ఎవరైనా విమర్శలు, ఆరోపణలు చేస్తే వారిపై కొడాలి నాని ఎదురుదాడికి దిగుతారు. అలాంటి మంత్రి అదే ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య ఇప్పటి వరకు రెండుసార్లు కొడాలి నానికి పరోక్షంగా వార్నింగ్‌లు ఇచ్చారు. అయినా వాటిపై మంత్రి స్పందించకపోవడం గమనార్హం.
 
నోరు అదుపులో పెట్టుకో మాట వినకుంటే ఇక చేతలే.. అంటూ ఇటీవల బాలకృష్ణ చేసిన హెచ్చరిక వైరల్‌గా మారింది. పేకాట క్లబ్‌ల వివాదంలో కొడాలి నాని చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. వ్యవస్థలో చట్టాలు ఉన్నాయని, న్యాయమంటూ ఒకటుందని.. లెక్కలేకుండా కొందరు అనుచితంగా మట్లాడుతున్నారని బాలయ్య మండిపడ్డారు. 
 
ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడం మంచిదికాదన్నారు. టీడీపీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తన సహనాన్ని పరీక్షించవద్దని, ఒట్టిమాటల మనిషినేకాదు.. అవసరమైతే చేతలు కూడా చూపిస్తా తస్మాత్ జాగ్రత్త అని బాలయ్య హెచ్చరించారు. అయినప్పటికీ కొడాలి నాని మాత్రం కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఇంతరీ వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ పేను వెనక్కి నెట్టిన ఫోన్ పే.. మూడో స్థానంలో పేటీఎం