Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే.. మంత్రి నానికి బాలయ్య వార్నింగ్

నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే.. మంత్రి నానికి బాలయ్య వార్నింగ్
, బుధవారం, 6 జనవరి 2021 (15:06 IST)
ఏపీ మంత్రి కొడాలి నానికి సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 
 
ఇటీవల తన నియోజకవర్గమైన గుడివాడలో పేకాటరాయుళ్లు అరెస్టయిన నేపథ్యంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, పేకాట ఆడితే జరిమానా కట్టడమే కదా, అందుకే జరిమానాలు కట్టేసి మళ్లీ వచ్చి ఆడుతుంటారని వ్యాఖ్యానించారు. 
 
అంతేకాదు, టీడీపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ స్పందించారు.
 
న్యాయం, చట్టంపై ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొడితే తీవ్రస్థాయిలో పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకో... మేం మాటల మనుషులం కాదు, అవసరమైతే చేతలు కూడా చూపిస్తాం అంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. 
 
తమ సహనాన్ని పరీక్షించవద్దని బాలయ్య స్పష్టం చేశారు. ఆయన ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటించారు. పలు గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కాగా, ఇప్పటికే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సప్ వినియోగదారులకు అలర్ట్ న్యూస్... Terms and Privacy Policy..?