Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోన్ ఎత్తరా.. మగాడివైతే.. చర్చకు రా : నోరు పారేసుకున్న మంత్రి కొడాలి నాని

Advertiesment
AP Minister Kodali Nani
, బుధవారం, 20 జనవరి 2021 (08:59 IST)
ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు నోరుపారేసుకున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా.. దమ్ముంటే, మగాడివైతే.. చర్చకు రా..! అంటూ సవాల్ విసిరారు. 
 
మచిలీపట్నంలోని పద్మావతి మహిళా కళాశాల క్రీడా ప్రాంగణంలో మంగళవారం వైఎస్సార్‌ పీకేఎం కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను మంత్రి నాని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విజయవాడలో ఉమా అరెస్టుకు తాను కారణమని చెప్పడం సబబు కాదన్నారు. ఉమాకు ఫోన్‌ చేశానని, అయితే ఫోన్‌ ఎత్తలేదన్నారు. చర్చలకు కట్టుబడి ఉన్నానన్నారు.
 
'‘ఎవరి షేపులు మారతాయో తెలుస్తుంది.. ఏ స్టూడియోలోనైనా చర్చకు సిద్ధంగా ఉన్నా.. చర్చలో నిన్ను కొట్టకపోతే రాష్ట్రం వదిలి వెళ్లిపోతా.. రోడ్డు మీద చర్చించడం అంటే.. ఇదేమీ కోడిపందేలు కాదు.. ఇందుకు నగర పోలీసు కమిషనర్‌ ఎలా ఒప్పుకుంటారు' అంటూ అన్నారు 
 
పోలీసులు హౌస్‌ అరెస్టు చేస్తారని దేవినేని ఉమాకు తెలుసని, చావు తెలివితేటలతో ఉమా వ్యవహరిస్తున్నారని, అందుకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. 
 
ఆ తర్వాత తన నోటికి పని చెప్పారు. "ఎక్కడికైనా నేనొస్తా. ఏ చానల్‌లో అయినా కూర్చుందాం. తేల్చుకుందాం.. నోటికొచ్చినట్టు సీఎం జగన్‌ని మాట్లాడితే ఊరుకోను. ఫోన్‌ ఎత్తరా మగాడివైతే. మీ నాయకుడు మోసగాడో.. మా నాయకుడు మోసగాడో తేల్చుకుందాం.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంటికొచ్చి కొడతా'' అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లి మాటలు విని దూరం పెట్టిందనీ.. ప్రేయసిని కత్తితో పొడిచి చంపేసిన ప్రేమోన్మాది!