Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

దేవీ
మంగళవారం, 3 జూన్ 2025 (18:03 IST)
Badmashulu team with Tarun Bhaskar
శంకర్ చేగూరి దర్శకత్వంలో బి బాలకృష్ణ, రమా శంకర్ నిర్మించిన తాజా చిత్రం బద్మాషులు. ఈ చిత్రంలో మహేష్ చింతల, విద్యాసాగర్, బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కవితా శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్ కీలకపాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన బద్మాషులు చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వినోదం అందించే సన్నివేశాలు, మంచి కామెడీ తో ట్రైలర్ బాగా వైరల్ అయింది. ఈ చిత్రం జూన్ 6న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకులు తరుణ్ భాస్కర్, మాలిక్ రామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 
 
అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. చాలామంది కామెడీ ని చాలా తేలిగ్గా తీసిపారేస్తుంటారు. కానీ ఆ కామెడీ సన్నివేశాలు వెనుక ఎంత కష్టం, నిజాయితీ దాగుందనేది చూసే వాళ్లకి అర్థం కాదు. ఆ సీన్లు రాసిన వాళ్లకే తెలుస్తుంది. పెళ్లిచూపులు చిత్రంలో కామెడీ సన్నివేశాలు రాస్తున్నప్పుడు మా నాన్న ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉంది. చాలా టెన్షన్ పడుతూ రాత్రి వేళల్లో ఆ సన్నివేశాలు రాసాను. మన టాలెంట్ తో నిజాయితీగా ప్రయత్నిస్తే మన కష్టానికి వడ్డీతో సహా ప్రతిఫలం దక్కుతుంది. మా నాన్న కి కోపం వచ్చినప్పుడు నన్ను కామన్ గా తిట్టే పదం బద్మాష్. బద్మాషులు చిత్రం మంచి విజయం సాధించాలి. ఆరవ తేదీ ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడండి అని తరుణ్ భాస్కర్ అన్నారు. 
 
డైరెక్టర్ మాలిక్ రామ్ మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ రాకముందు డిజె టిల్లు అనేది చిన్న చిత్రం. ఈ నగరానికి ఏమైంది చిత్రానికి ముందు పెళ్లి చూపులు అనేది ఒక స్మాల్ బడ్జెట్ మూవీ. ఈ రోజున విజయం సాధించే చిన్న బడ్జెట్ చిత్రాలే రేపు పెద్ద బడ్జెట్ చిత్రాలకు నాంది పలుకుతాయి. బద్మాషుల చిత్రం కూడా భవిష్యత్తులో ఒక పెద్ద చిత్రానికి నాంది పలకబోతోంది అని అనిపిస్తుంది. ఈ చిత్రం విజయం సాధించాలి అని మాలిక్ రామ్ అన్నారు. 
 
బద్మాషులు చిత్ర డైరెక్టర్ శంకర్ చేకూరి మాట్లాడుతూ.. తరుణ్ భాస్కర్ అన్న ఈ చెత్త ఫ్రీ రిలీజ్ కి వచ్చి బద్మాష్ లో చిత్రాన్ని మరో స్థాయికి పెంచారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. బద్మాషులు మూవీ రెండు గంటల పాటు ఫన్ రైడ్ గా సాగుతుంది. హాస్యం అందిస్తూనే ఒక మంచి మెసేజ్ ఈ కథ ద్వారా అందించాం అని అన్నారు.
 
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన మహేష్ చింతల మాట్లాడుతూ.. బద్మాషులు చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ మూవీ ద్వారా సహజసిద్ధమైన హాస్యాన్ని అందించాం. పెద్ద సినిమాలు సిటీ లాంటివి అయితే మా చిన్న సినిమాలు పల్లెటూరు లాంటివి. అప్పుడప్పుడు పల్లెటూర్లకు కూడా వెళుతూ ఉండాలి అని మహేష్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన డీఆర్డీవో

రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం : సీఎం రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments