Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

దేవీ
మంగళవారం, 3 జూన్ 2025 (17:39 IST)
Rana Daggubati, Venkatesh
2023లో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సిరీస్ ‘రానా నాయుడు’కి కొన‌సాగింపుగా ‘రానా నాయుడు సీజ‌న్‌2’ మ‌న ముందుకు రానుంది. గ‌త‌సారి కంటే క‌ఠిన‌మైన, చీక‌టి పొర‌ల‌ను క‌లిగిన అంశాలు ఇందులో ఉండ‌బోతున్నాయి. ఈసారి ఫిక్సర్ కుటుంబం ఇబ్బందుల్లో ప‌డుతుంది. సాధార‌ణంగా త‌న క్లైంట్స్ కోసం స‌మ‌స్య‌ల‌ను సాల్వ్ చేసి రానా నాయుడు ఈసారి త‌న కుటుంబం కోసం రంగంలోకి దిగుతాడు. కుటుంబం ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు నియ‌మ నిబంధ‌న‌ల‌కు సంబంధిచిన హ‌ద్దుల‌ను అత‌ను దాటుతాడు.
 
సీజ‌న్‌1లో ప్రేక్ష‌కులు రానా నాయుడు అనే అద్భుత‌మైన ప్ర‌పంచంలోకి తీసుకెళ్ల‌బ‌డ్డారు. ధ‌న‌వంతులు, దురాశ‌ప‌రులు చేసిన త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చే నైపుణ్య‌మున్న రానా నాయుడు, నేరాల‌ను చెరిపేయ‌గ‌ల‌డు, జీవితాల‌ను తిర‌గ రాయ‌గ‌ల‌డు, భ‌యంకర‌మైన ర‌హ‌స్యాల‌ను ఎవ‌రికీ క‌నిపించ‌కుండా దాచేయ‌గ‌ల‌డు. ప్ర‌పంచంలో ఎలాంటి ప‌నినైనా చేయ‌గ‌ల రానా, త‌న తండ్రిని మాత్రం ఎదుర్కొన‌లేడు. రానా నాయుడు తండ్రి నాగ నాయుడు కొడుక్కి దూరంగా ఉంటాడు. ఓ సంద‌ర్భంలో కొడుకు జీవితంలోకి నాగ‌నాయుడు ప్ర‌వేశించాల్సి వ‌స్తుంది. ఎవ‌రికీ తెలియ‌ని ఓ గ‌తాన్ని మోసే టైం బాంబ్‌లాంటి వ్య‌క్తి నాగ నాయుడు. నాయుడు కుటుంబం ఏప‌నిని అసంపూర్తిగా చేయ‌రు. ప్రమాద‌క‌ర‌మైన వ్య‌క్తులు, గాయాల‌ను భ‌రిస్తున్నవారు. గ‌తంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఎదుర్కొన‌టానికి సిద్ధంగా ఉంటారు.
 
సీజ‌న్1 కంటే సీజ‌న్‌2లో మ‌రింత తీవ్ర‌త‌ర‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తాయి. ఈసారి వారు ఎదుర్కొన‌బోయే ప్ర‌మాదం వారి వ్య‌క్తిగ‌త‌మైన‌ది. పాత గాయాల‌కు ప‌గ తీర్చుకోవాల‌ని గ‌తం కోరుకుంటుంది. ర‌వుఫ్‌- రానాకు స‌మాన‌మైన శ‌త్రువు. త‌న ప‌గ‌ను తీర్చుకోవ‌టానికి ఎలాంటి ప‌నినైనా చేయ‌టానికి వెనుకాడు. రానా చిట్ట‌చివ‌ర‌గా ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌నిని ఫిక్స్ చేయాల‌ని భావిస్తాడు. ఆ ప్ర‌య‌త్నంలో అత‌ను చివ‌రి వ‌ర‌కు చేరుకుంటాడు. అది విజ‌య‌వంత‌మైతే అత‌ని కుటుంబ భ‌విష్య‌త్తు బాగుంటుంది. అయితే రౌఫ్ రూపంలో అనుకోని తుపాన్ ఎదుర‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య యుద్దం మొద‌ల‌వుతుంది. స‌మ‌యం పూర్తైపోతుంటుంది. దారులు మూసుకుపోతుంటాయి. ఇలాంటి ప‌రిస్థితుల్ల‌ను రానా అదుపులోకి తెచ్చుకోగ‌ల‌డా?  లేక ఇబ్బంది ప‌డ‌తాడా? అనేది జూన్‌13న రానా నాయుడు సీజ‌న్‌2 స్ట్రీమింగ్ కేవ‌లం నెట్‌ఫ్లిక్స్‌లో మాత్ర‌మే చూడొచ్చు.
 
సూర్వీన్ చావ్లా, కృతి ఖర్భందా, సుషాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, మరియు డినో మోరియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సీజ‌న్‌2లో ఆక‌ట్టుకునే యాక్ష‌న్‌, హై ఓల్టేజీ ఫ్యామిలీ డ్రామా ఉండ‌నుంది. కుట్ర‌, విమోచ‌నం ఇంకా వాటి మ‌ధ్య ఉండే బావోద్వేగాల‌ను ఈ సీజ‌న్‌లో మ‌నం చూడొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments