Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

దేవీ
మంగళవారం, 12 ఆగస్టు 2025 (15:41 IST)
Manipulator title unveiled by B. Gopal
“ఏ స్టార్ ఈజ్ బార్న్” టైటిల్ మార్చి ఇప్పుడు "మ్యానిప్యూలేటర్" గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ ఆవిష్కరించారు. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో  సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా  కళ్యాణ్, ప్రియా పాల్, సోఫియా ఖాన్, ఊహ రెడ్డి లను  తెలుగు తెరకు పరిచయం చేస్తూన్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ... "మ్యానిప్యూలేటర్ టైటిల్ యువతకు కనెక్ట్ అయ్యే లా ఉందని అన్నారు, ఈ సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను , ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాల వైపే ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు, ఈ  మ్యానిప్యూలేటర్ సినిమా కూడా అదే వరుసలో  ఉంటుందని" అన్నారు.
 
 ఈ సినిమాలో  దర్శకుడు విజె సాగర్ 43 మంది కొత్త నటీనటులు పరిచయం చేయడం విశేషం.  ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం 5 డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి, తనికెళ్ళ శంకర్, వరికుప్పల యాదగిరి, విశ్వనాథ్ ఈ సినిమా కోసం సాహిత్యం అందించారు. 
 
త్వరలో ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా జరుపుకుని, విడుదలకి సిద్ధమవుతుంది. ఈ సినిమా కేవలం నేటి యువతను దృష్టిలో పెట్టుకొని చేసి తీశారు. ప్రస్తుతం ఉన్న యంగ్ స్టర్స్  లైఫ్ స్టైల్ ను కళ్ళకు కట్టినట్లు దర్శకుడు విజే సాగర్  మ్యానిప్యూలేటర్ సినిమాలో చూపించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Green anacondas: వామ్మో.. కోల్‌కతాలోని అలీపూర్ జూకు రెండు ఆకుపచ్చ అనకొండలు

Khazana Jewellery: ఖ‌జానా జ్యువెల‌రీలో దోపిడీ.. ఎంత ఎత్తుకెళ్లారంటే..? (video)

ఆస్తి కోసం కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...

జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్- వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్.. ఇవి ఎన్నికలా? సిగ్గుగా వుందంటూ జగన్ ఫైర్ (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

తర్వాతి కథనం
Show comments