Janani, Tjay Arunasalam, Rasi and others
యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా 'ఉసురే' ఆగస్టు 1న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజయ్ అరుణాసలం, జననీ కునశీలన్ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్ డి.గోపాల్ దర్శకుడు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్ పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రాశి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
హీరోయిన్ రాశి మాట్లాడుతూ '' ఈ చిత్రంలో నా పాత్ర ఎలా ఉంటుందో ట్రైలర్ చూశారు. ఈ చిత్రంలో నేను హీరోని కొట్టాను.. హీరోయిన్‌ని కొట్టాను.. ప్రేయసిరావే చిత్రంలో హీరో శ్రీకాంత్‌ని కొట్టాను.. ఈ సినిమా హిట్ అయ్యింది. నాకున్న సెంటిమెంట్ ప్రకారం ఉసిరే కూడా హిట్.. ఎందుకంటే నేను ఎవరిని కొడితే వాళ్ల సినిమా హిట్.. యదార్థ సంఘటనలతో ఈ సినిమా రూపొందింది. దర్శకుడు మంచి విజన్‌తో ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా కంటెంట్ బాగుంటుంది. నిర్మాత సినిమాను చాలా రిచ్‌గా నిర్మించాడు. నా కూతురుగా నటించిన జననికి హీరోయిన్‌గా మంచి భవిష్యత్ ఉంది. హీరో కూడా ఎంతో నేచురల్‌గా కనిపిస్తాడు. సినిమాలో మంచి ట్విస్ట్ ఉంది. నా పాత్ర చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ప్రాణం పెట్టి కష్టపడి చేశారు. నాకు కూడా ఈ సినిమా మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను' అన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ డి.గోపాల్ మాట్లాడుతూ '' నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయనపై నాకు ఎంతో నమ్మకం ఉంది.ఇటీవల చెన్నయ్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను లెజెండరీ నటుడు కమల్‌హాసన్ గారికి చూపించాను. ఆయనకు ట్రైలర్ ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అభినందించారు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. మా సినిమాకు తగిన నటీనటులు కుదిరారు. ఈ సినిమాను చిత్తూరులోని ఓ గ్రామంలో చిత్రీకరించాం. ఓ అచ్చ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఎంతో సహజంగా చిత్రీకరణ చేశాం' అన్నారు.
నిర్మాత మౌళి ఎం. రాధాకృష్ణ మాట్లాడుతూ '' ఉసిరే దర్శకుడు నాకు కజిన్. పన్నెండేళ్ల క్రితం ఓ షార్ట్ ఫిలిం చేస్తానని నాతో చెప్పాడు. ఆ తరువాత ఈ సినిమా చేశాం. ఇదొక రియల్ ఇన్‌సిడెంట్.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్ ఇష్యూని ఈ చిత్రంలో చర్చించాం. ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునే లవ్‌స్టోరీ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ మదర్ పాత్రను రాశి గారు చేశారు. ఈ పాత్రకు ఆమెకు బాగా కుదిరారు. అనసూయ పాత్రలో ఆమె నటన అందర్ని అలరిస్తుంది. పవర్‌ఫుల్ పాత్ర ఆమెది. ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్, విజయ్‌సేతుపతి శృతిహాసన్ అందరూ సపోర్ట్ చేశారు. కొత్త టీమ్‌తో రూపొందిన ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు' అన్నారు.