Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ స్నేహితురాళ్లతో అబ్బాయిలు ఇలా వుంటారా? కంగనా... ఇలాంటి సీక్రెట్స్ చెప్పించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనీ...?

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (12:45 IST)
ఈమధ్య గేమ్ షోలు పక్కదోవ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, తెరపైనే రాసలీలలు... గట్రా అన్నీ చూపించేస్తున్నారు. సినిమాల్లో అయితే పిల్లల్ని తీసుకెళ్లకుండా పెద్దలు ఎంజాయ్ చేస్తారేమో కానీ ఇపుడు బుల్లితెర పైనే ఏకంగా ఈ సంబంధాల గురించి నేరుగా చెప్పేస్తున్నారు.

 
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి గేమ్ షోలకి కొదవేలేదు. డబుల్ మీనింగ్ డైలాగులు, లైవ్ లోనే పెదవులపై పెదవులతో ముద్దులు పెట్టుకోవడాలు చూపించేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ లాకప్ అనే షోను నిర్వహిస్తోంది.

 
ఆమె నిర్వహించే ఈ షో అంటే యూత్‌లో చాలా క్రేజ్. ఈ గేమ్‌లో ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకోవాలంటే పార్టిసిపెంట్ ఒక సీక్రెట్‌ చెప్పాల్సి ఉంటుంది. సీక్రెట్ అంటే... అలాంటి ఇలాంటిది కాదు. బుల్లితెరలో చెప్పిన సీక్రెట్ గురించి కనీసం నెల రోజులకు తగ్గకుండా చర్చించుకోవాలన్నట్లుగా సాగుతున్నాయి ఈ సీక్రెట్స్. ఈ షోలో భాగంగా లాకప్‌ కంటెస్టెంట్‌, క్రికెటర్‌ శివమ్‌ శర్మ తన గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టాడు.

 
అది మామూలు సీక్రెట్ కాదు. తన తల్లి స్నేహితురాలితో బెడ్‌ షేర్‌ చేసుకున్నట్లు అతను చెప్పాడు. 'మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. ఆమె విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఆమెకు నేనంటే ఇష్టం. వైట్‌ సాస్‌ పాస్తా తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేవాడిని. ఆమెతో పడక షేర్‌ చేసుకున్నాను. ఇది ఎనిమిదేళ్ల క్రితం... అంటే నా కాలేజీ రోజుల్లో జరిగింది' అని శివమ్‌ శర్మ చెప్పుకొచ్చాడు. అతడు చెప్పిన సీక్రెట్‌ విని అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.

 
వాళ్లు షాకవడం ఏమోగానీ... ఈ గేమ్ చూస్తున్న చాలామంది పెద్దలు ఇదేం సీక్రెట్‌రా బాబోయ్... అంటూ చర్చించుకుంటున్నారు. అమ్మ స్నేహితురాళ్లతో అబ్బాయిలు ఇలా వుంటారా? అనే టాపిక్ మొదలైంది. మరీ ఇలాంటి సెన్స్‌లెస్ సీక్రెట్లు చెప్పించి కంగనా రనౌత్ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటుందో అని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments