నా భార్యకు అన్న.. నాకు బావ.. త్రివిక్రమ్‌తో రిలేషన్స్‌పై జూనియర్ ఎన్టీఆర్

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (16:17 IST)
మాటల మాంత్రికుడుగా గుర్తింపు పొందిన టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తనకున్న వ్యక్తిగత సంబంధాలపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం "అరవింద సమేత వీర రాఘవ". ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుంది.
 
ఈ చిత్రం సక్సెస్ మీట్‌ తాజాగా జరిగింది. ఈ సందర్భంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని మాట్లాడుతూ, 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం విజయం పూర్తి క్రెడిట్ దర్శకుడు త్రివిక్రమ్‌దేనని చెప్పారు. త్రివిక్రమ్‌ను సంభోదిస్తూ ఎన్టీఆర్ చెప్పిన మాటలు వారిద్దరి మధ్య ఉన్న సఖ్యతను, అనుబంధాన్ని చాటి చెప్పాయి. 
 
'నా మిత్రుడు, ఆత్మీయుడు, శ్రేయోభిలాషి, అన్న, ఆత్మ బంధువు, మా అమ్మకు ఇంకో కొడుకు, నా పిల్లలకు మావయ్య, నా భార్యకు అన్న, నాకు బావ.. ఎన్నిఎన్ని బంధాలతో పిలిచినా పలికే ఆత్మీయుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక చిత్రం చేయాలి... చేస్తే జీవితాంతం నా గుండె లోతుల్లో ఆ చిత్రం చిరస్థాయిగా మిగిలిపోవాలి. రేపొద్దున గర్వంగా ఆ చిత్రాన్ని నా పిల్లలకు చూపించుకోవాలి. సమాజానికి ఆ చిత్రాన్ని చూపించి.. నేను కూడా గర్వంగా నిలుచునే స్థాయిలో ఉండాలని కోరుకున్న ఆ తరుణం మూడు రోజుల క్రితం రానే వచ్చింది' అని వ్యాఖ్యానించారు. 
 
ఈ చిత్ర విజయాన్ని త్రివిక్రమ్ తన ఖాతాలో వేస్తున్నాడని.. అది తప్పు అని జూనియర్ చెప్పాడు. ఎందుకు తప్పంటే... త్రివిక్రమ్‌ను తాను నమ్మాను సరే.. ఆయనను అంతలా నమ్మేలా చేసింది ఆయనే కదా అని ఎన్టీఆర్ చెప్పడం విశేషం. త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన ఓ అద్భుతమైన విజయమే అరవింద సమేత వీర రాఘవ అని ఎన్టీఆర్ చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments