Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరాలతో అనుష్క... ఎన్నారై మహిళగా

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (09:04 IST)
'బాహుబలి' చిత్రం తర్వాత అనుష్క శెట్టి ఎట్టకేలకు మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించింది. బాహుబలి తర్వాత ఆమె నటించనున్న చిత్రం ఇదే. గత యేడాది కాలంగా కెమెరా ముందుకురాని అనుష్క ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ చిత్రానికి 'ఎ ఫ్లాట్', 'ముంబై 125కేఎం', 'వస్తాడు నా రాజు' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు.
 
ఈ చిత్రంలో ఓ ఎన్నారై బిజినెస్ వుమెన్‌‌గా అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. అంజలి, షాలినీ పాండే కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి 'సైలెన్స్' అనే పేరు ఖరారు చేశారు. మార్చి నెల చివరకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కథ, తన పాత్ర నచ్చడంతోనే అనుష్క ఈ చిత్రం ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. 
 
సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క కొత్త లుక్‌లో కనిపించనున్నారని, అందుకోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

BRS: కాంగ్రెస్ నేత వేధింపులు.. టెర్రస్‌పై నుంచి దూకి బీఆర్ఎస్ కార్మికుడు ఆత్మహత్య

Elon Musk: అమెరికా సర్కారులోని DOGE ఛైర్మన్ పదవికి ఎలెన్ మస్క్ రాజీనామా

యూపీలో భారీ ఎన్‌కౌంటర్ - లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ ఖతం

అలాంటి వారంతా ఫేక్ ముస్లింలు : మేమంతా శ్రీరాముడి వంశస్థులమే... బీజేపీ నేత జమాల్ సిద్ధిఖీ

Asaduddin Owaisi : పాక్‌కు ఉగ్రవాదంతో సంబంధాలు.. FATF గ్రే లిస్టులో తిరిగి చేర్చాలి: అసదుద్ధీన్ ఓవైసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments