హ‌ను-మాన్‌ నుంచి విజయ్ సేతుపతి ఆవిష్క‌రించిన అమృత అయ్యర్ ఫస్ట్ లుక్‌

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:56 IST)
Amrita Iyer
జాంబిరెడ్డి డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మ మరో సారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. హ‌ను-మాన్ చిత్రం ద్వారా  తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.  మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా యంగ్‌ హీరో తేజ సజ్జతో క‌లిసి ప్రశాంత్ వర్మ తెర‌కెక్కిస్తోన్న `హను-మాన్`  సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానుంది.
 
ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు హనుమంత హార్ట్ బీట్‌ను మేకర్స్ ప్రకటించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలోని హీరోయిన్ అమృత అయ్యర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అంజనాద్రి ప్రపంచంలోని మీనాక్షి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను నేడు విడుదల చేశారు.
 
సూపర్ హీరో స్టైల్లో తేజ సజ్జాకు సంబంధించిన పరిచయం జరగ్గా.. ఇప్పుడు అమృతా అయ్యర్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించారు. చుట్టూ అందమైన ప్రకృతి, పక్షులతో అలా పడవలో మీనాక్షి ప్రయాణం చేస్తోంది. ఓ దేవకన్యలా కనిపిస్తున్న అమృతా అయ్యర్.. ఈ పాత్రకు సరిగ్గా సరిపోయారు.
 
మన పురాణాలు ఇతీహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి. సూపర్ హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి. అలాగే  సూప‌ర్ హీరో మూవీస్‌ని అన్ని వ‌ర్గాల వారు ఇష్ట‌ప‌డ‌తారు. హ‌ను-మాన్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
 
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తోంది. ప్ర‌ముఖ న‌టీన‌టులు, టాప్-గ్రేడ్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్నారు.
 
శ్రీ‌మ‌తి చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో కె. నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, వెంక‌ట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూస‌ర్‌, కుశ‌ల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌.
 
ఈ చిత్రం కోసం నలుగురు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.
 
ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments