రాజమౌళి ప్రోత్సాహం మర్చిపోలేను - వాళ్ళు బ్లాక్‌స్టార్ అంటారు - షానీ సాల్‌మాన్ (షానీ)
, మంగళవారం, 30 నవంబరు 2021 (11:45 IST)
అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు కావాలని ఓ హోల్డింగ్ చూసి అప్లయి చేశా. ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు రాజమౌళిగారి సినిమా కోసమని తెలిసి ఆశ్చర్యపోయాయనని- నటుడు, అథ్తెటిక్ అయిన షానీ సాల్‌మాన్ తెలియజేస్తున్నారు. చిత్రమైన మేనరిజం, లుక్‌తో ఆయన ఎంతో మంది దర్శకులను ఆకట్టుకున్నారు. 70 సినిమాలకుపైగా నటించిన ఆయన తాజాగా `రామ్ అసుర్`లో రెండు వేరియేషన్ వున్న పాత్రలు పోషించారు. వీటికి మంచి స్పందన వచ్చిందని ఆయన తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన విలేకరులతో ఇలా పంచుకున్నారు.
- రామ్ అసుర్ చిత్రం ఘన విజయం సాధించడం తన జీవితంలో కీలక మలుపని, విజయోత్సవ సభలకు ఎక్కడికెళ్లినా శివన్నాఅంటూ ప్రేక్షకులు ఆప్యాయంగా పిలవడంతో తన గుర్తింపు మరింత పెరిగింది.
- బేసికల్‌గా స్పోర్ట్స్‌మెన్ ను. ఓరోజు హైదరాబాద్ నగరంలో ఓ హోల్డింగ్ చూశా. ఆ ప్రకటనలో అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు కావాలని, అర్హులైన వారు సంప్రదించాలని ఉంది. స్వతహాగా నేను నేషనల్ ఛాంపియన్ అయినందున దరఖాస్తు చేశా.
- 2003లో ఇంటర్వ్యూకి వెళ్ళా. అది దర్శకుడు రాజమౌళి గారి సినిమా ఆడిషన్స్ ప్రకటన అని తెలుసుకున్నా. ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు రాజమౌళి గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ నా భుజం తట్టి ప్రోత్సహించారు.. నా లుక్ వెరైటీగా ఉండడంతో అవకాశం కల్పించారు. అదే నా జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఆ సినిమా ఘన విజయం కావడంతో `సై షాని` గా పిలవడం మొదలుపెట్టారు. ఆ సినిమా నాకు మరిన్ని సినిమాలు తెచ్చిపెట్టింది.
- నాది జెడ్చర్ల. ఉస్మానియా యూనివర్శిటీ లో డిగ్రీ, పీజీ నిజాం కాలేజ్‌లో చదివాను. నటుడిగా ఇప్పటిదాకా 70కిపైగా సినిమాల్లో నటించా. రాజమౌళి గారి 'సై' చిత్రం ఘన విజయం సాధించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఘర్షణ, దేవదాస్, హ్యాపీ, రెడీ, ఒక్క మగాడు, శశిరేఖా పరిణయం లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించా. `అలా.. ఎలా..` చిత్రంలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తో కలిసి హీరోకు సమానమైన పాత్ర పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యా.
- ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో30 సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. 'దేశంలో దొంగలు పడ్డారు' సినిమాలో కూడా హీరో పాత్ర పోషించాను. అలా.. ఎలా.., దేశంలో దొంగలు పడ్డారు, రాక్షసి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించా.
- డిసెంబరులో నేను నటించిన `కిన్నెరసాని, అమరన్, గ్రే, పంచతంత్ర కథలు`చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నేను నల్లగా ఉండడం కూడా ఎసెట్. ఎందుకంటే "బ్లాక్‌స్టార్ష అని స్నేహితులు ముద్దుగా పిలుచుకుంటారు.
- నేను మంచి స్టార్‌గా ఎదగాలి. చిత్ర రంగంలో పేద, వృద్ధ కళాకారులను ఆదుకోవాలన్నది లక్ష్యం. సినీ పరిశ్రమలో కొత్తగా వచ్చే నటీనటులను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాలేజ్ మిత్రుడు విజయానంద్ తో కలిసి గడచిన ఐదేళ్లుగా ఓవర్-7 ప్రొడక్షన్ ద్వారా నూతన కళాకారులను ప్రోత్సహించడంతో పాటు యాడ్ ఫిలిమ్స్ అండ్ క్యాస్టింగ్, ఫిలిం ప్రొడక్షన్, సెలబ్రిటీ మేనేజ్‌మెంట్, ఫిల్మ్ ప్రొడక్షన్ చేస్తున్నా.
- ఓవర్-7 ప్రొడక్షన్ ద్వారా సామాజిక బాధ్యతగా అంధులు, వృద్ధులు, అనాధలకు అన్నదానం, వైద్య సాయం, దుస్తులు అందించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. రీసెర్చ్ మీడియా గ్రూపులో క్రియేటీవ్ హెడ్‌గా అనేక కార్పొరేట్ ఈవెంట్‌లను విజయవంతంగా నిర్వహిస్తున్నా.
- తెలుగు చిత్రాలకు ఎంతోమంది నటీనటులకు అవకాశాలు కల్పించడం జరిగింది. వారంతా ఇప్పుడు స్టార్స్‌గా రాణించడం సంతోషాన్ని కలిగిస్తుంది.
- తెలుగుతో పాటు తమిళం, హిందీ ఈ చిత్రాల్లో నటించా. బాలీవుడ్‌లో `వెల్‌కం టూ సజ్జన్‌పూర్` చిత్రంలో మంచి పాత్ర పోషించా. ఈ మధ్యే కొన్ని కథలు విన్నా. ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతానని చెప్పగలను. నాకు ఈ గుర్తింపు రావడానికి కారణమైన దర్శకులకు, నిర్మాతలకు, నా తోటి నటీనటులకు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న' అని అన్నారు.
తర్వాతి కథనం