Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒమిక్రాన్ లక్షణాలు ఏంటి.. డెల్టా ప్లస్ కంటే ప్రమాదమా?

Advertiesment
Omecron Symptoms
, మంగళవారం, 30 నవంబరు 2021 (11:04 IST)
ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కరోనా డెల్టా ప్లస్ కంటే ప్రమాదకరమైనది కాదని వైద్యులు అంటున్నారు. అలాగే, ఈ వైరస్ లక్షణాలు డెల్టాకు కాస్త భిన్నంగా ఉంటాయని వారు చెబుతున్నారు. 
 
ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. ఫస్ట్ వేవ్‌లో కరోనా వైరస్ వణికించింది. సెకండ్ వేవ్‌లో కరోనా డెల్టా వైరస్ భయభ్రాంతులకు గురిచేసింది. ఇపుడు ఒమిక్రాన్ అనే వేరియంట్ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడిపోతున్నాయి. ఈ వైరస్ సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
 
ఇప్పటికే సౌతాఫ్రికా దేశాల్లో పలు కేసులను నమోదయ్యాయి. ఈ దేశాల నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. భారత్‌తో సహా అనేక ప్రపంచ దేశాల్లో ఈ తరహా కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. 
 
ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి ప్రయాణికులపై గట్టి నిఘా సారించాయి. ఆ దేశాలకు విమానా రాకపోకలను నిలిపివేస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వైరస్ వ్యాప్తి అత్యధికంగా సౌతాఫ్రికా, ఇటలీ, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, హాంకాంగ్, బోట్స్‌వానా, చెక్ రిపబ్లిక్, బవేరియా, ఆస్టియా, బ్రిటన్ దేశాల్లో ఉంది. దీంతో ఈ దేశాల నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. 
 
అయితే, ఈ వేరియంట్ లక్షణాలు ఏంటి.. ఏ వయసు వారిపై అధిక ప్రభావం చూపిస్తాయి అనే అంశాలను పరిశీలిస్తే, ఈ వైరస్ లక్షణాలు కరోనా వైరస్ కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. కరోనా వైరస్ అంతటి ప్రమాదకరం కాకపోయినప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, ఒమిక్రాన్ వైరస్ సోకిన వ్యక్తుల్లో గొంతులో ఇబ్బంది, శరీరంలోని మాంసపు భాగాల్లో నొప్పి, పొడి దగ్గు వంటి ప్రధాన సమస్యలున్నట్టు గుర్తించారు. ఈ వేరియంట్ లక్షణాలు డెల్టా వేరియంట్ లక్షణాలకు పూర్తి విభిన్నంగా ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబరు ఒకటో తేదీ నుంచి నయా రూల్స్ - వినియోగదారులకు షాక్