ఓమిక్రాన్ పేరు చెప్తే ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ నెమ్మదిగా ప్రపంచ దేశాలకు పాకడం కలవరపెడుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో 12 దేశాలకు ఓమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి.
మనదేశం కూడా ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత నేపథ్యంలో అప్రమత్తమైంది. విదేశాల నుంచి ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనుంది. దీనిపైఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే దక్షిణాఫ్రికా, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్, హాంకాంగ్, ఇటలీ, బెల్జియం, డెన్మార్క్, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా దేశాల్లో ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఓమిక్రాన్ ప్రభావంతో ప్రపంచ దేశాలు తమ దేశానికి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేయడంతో పాటు.. క్వారంటైన్ నిబంధనలను విధిస్తున్నాయి.