Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:53 IST)
చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. కానీ, ఈ చిత్రం విడుదలకు ముందే ఓ వ్యక్తి తిలకించారు. సైరాను తిలకించిన తొలి ప్రేక్షకుడు ఆయనే. ఆయన పేరు అల్లు అరవింద్. ప్రముఖ నిర్మాత. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు కాకుండా ఈ సినిమా చూసిన మొదటి ప్రేక్షకుణ్ణి నేనే. ఇంత భారీ బడ్జెట్‌ సినిమా ఎలా ఉంటుందోనన్న భయంతో చూశా. ఒక్కో సీన్‌ చూసి కింద పడిపోయా. కింద నుంచి లేచి చిరంజీవిని కౌగిలించుకున్నా. అంత అద్భుతంగా సినిమా వచ్చింది అని చెప్పుకొచ్చారు. 
 
ఆ తర్వాత చిత్ర దర్శకుడు ఏ.సురేందర్ రెడ్డి స్పందిస్తూ, 'ఈ సినిమా కోసం 250 రోజులు చిత్రబృందమంతా ఓ కుటుంబంలా చాలా కష్టపడ్డాం. వాళ్లందరికీ, తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చిరంజీవికి, రామ్‌చరణ్‌కి థ్యాంక్స్‌. చరణ్‌ ఎంతో ఫ్రీడమ్‌ ఇచ్చి ముందుకు నడిపించారు అని చెప్పారు. మరో సెన్సేషనల్ డైరెక్టర్ వివి.వినాయక్ మాట్లాడుతూ, 'తెలుగు సినిమా రారాజు, అన్నయ్య చిరంజీవి ఈ సినిమాలో ఉగ్ర నరసింహస్వామిలా ఉన్నారు' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం ఉందని తెలిసి భర్తను హత్య చేసిన భార్య

మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments