Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ సైరా ట్రైల‌ర్ టాక్ ఏంటి..? (video)

Advertiesment
మెగాస్టార్ సైరా ట్రైల‌ర్ టాక్ ఏంటి..? (video)
, గురువారం, 19 సెప్టెంబరు 2019 (10:33 IST)
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సంచ‌ల‌న చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. మెగాస్టార్ తనయుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది.
 
ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేసారు సినిమా యూనిట్. నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతను కరణ జన్ముడు. అతనొక యోగి, యోధుడు అతన్ని ఎవరూ ఆపలేరు అంటూ బ్యాక్ గ్రౌండ్లో వచ్చే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము, నీకెందుకు కాట్టాలిరా శిస్తు... అంటూ మెగాస్టార్ పలికే డైలాగ్ స్ప్హూర్తి రగిలిస్తుంది. 
 
ఇక స్వతంత్రం కోసం జరుగుతున్న ఈ తొలి యుద్ధంలో నువ్వు గెలవాలి... అంటూ అమితాబ్, అలానే నీ గెలుపుని కళ్లారా చూడాలని వచ్చాను సైరా నరసింహారెడ్డి అంటూ సుదీప్, వీరత్వానికి పేరైన తమిళ భూమి నుండి వచ్చాము, రాముడికి లక్ష్మణుడి మాదిరి ఎప్పుడూ ఉంటాము, అది విజయమో వీర స్వర్గమో అంటూ విజయ్ సేతుపతి పలికే డైలాగ్స్ తో స్వాతంత్య్ర తొలి పోరాటంలో నరసింహా రెడ్డి అనుచరులెవరో పరిచయం చేశారు. 
 
ఇక ట్రైలర్‌లో చివరిలో నీ చివరి కోరిక ఏదైనా ఉందా అని బ్రిటిషర్లు అడగగా, గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అంటూ మెగాస్టార్ పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టారు. డైలాగ్స్ తో పాటు అత్యద్భుతమైన విజువల్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ తో మొత్తంగా ఈ ట్రైలర్ సినిమా మీదున్న అంచనాలని మరింత పెంచేసింది. 
 
మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన‌ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈనెల 22 న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో గ్రాండ్‌గా జరగనుండగా, సినిమాను అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు. మ‌రి... ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.. సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేనాటి వీరుడి కథ "సైరా".. దుమ్మురేపుతున్న మెగాస్టార్