Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సినిమాలన్నింటిని బ్యాన్ చేస్తే మంచిది.. బాలీవుడ్ నటి

బాలీవుడ్ హీరోయిన్లలో ట్వింకిల్ ఖన్నా ఒకరు. ఈమె పలు చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. అంతేనా... మంచి రచయితగా గుర్తింపు పొందింది. నిర్మాతగా కూడా రాణిస్తోంది. అలాంటి ట్వింకిల్ ఖన్నా... ఆమె నట

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (14:38 IST)
బాలీవుడ్ హీరోయిన్లలో ట్వింకిల్ ఖన్నా ఒకరు. ఈమె పలు చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. అంతేనా... మంచి రచయితగా గుర్తింపు పొందింది. నిర్మాతగా కూడా రాణిస్తోంది. అలాంటి ట్వింకిల్ ఖన్నా... ఆమె నటించిన చిత్రాలన్నింటిపై నిషేధం విధించాలని కోరుతోంది. ఇంతకూ ఆమె అలా వ్యాఖ్యానించడానికి గల కారణాలేంటో పరిశీలిద్ధాం.
 
నా సినిమాలన్నింటిని బ్యాన్‌ చేయండి.. అప్పుడు ఎవరూ వాటిని చూడలేరు.. దాంతో వాటిని రీమేడ్‌ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు’ అంటూ చమత్కరించారు నటి, నిర్మాత, రచయిత ట్వింకిల్‌ ఖన్నా.  
 
'పైజమాస్‌ ఆర్‌ ఫర్‌గివింగ్‌' పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ పుస్తకాన్ని ఆమె రచించారు. ఈ బుక్ రిలీజ్ కార్యక్రమం తర్వాత ట్వింకిల్ మీడియాతో మాట్లాడారు. అపుడు ట్వింటిల్ ఖన్నాకు ఓ విలేకరి ఓ తుంటరి ప్రశ్న సంధించాడు. 'మీరు నటించిన ఏ చిత్రాన్ని రీమేడ్‌ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు' అని అడిగాడు. 
 
దీనిపై ఆమె సమాధానమిస్తూ, 'నేను ఒక్క హిట్‌ కూడా ఇవ్వలేదు. అందువల్ల నేను నటించిన సినిమాలన్నింటిని బ్యాన్‌ చేస్తే మంచిది. అప్పుడు ఎవరూ వాటిని చూడలేరు.. రీమేడ్‌ చేయాలనే ఆలోచన కూడా రాదం'టూ ట్వికిల్‌ జోక్‌ చేశారు.
 
కాగా, 'బర్సాత్' చిత్రం ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ట్వింకిల్‌ ఖన్నా.. ఆపై వరుసగా 'ఇతిహాస్', 'జుల్మి', 'మేలా' వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో వెంకటేష్‌ సరసన 'శీను' చిత్రంలో నటించారు. ఆపై వరుస వైఫల్యాలు రావడంతో సినిమాలకు స్వస్తి చెప్పి 2001లో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ట్వింకిల్‌ ఖన్నా రచయిత్రిగా బిజీ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments