Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రావణ మాసంలో ఆకుకూరలు తినకూడదట..

శ్రావణ మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైన మాసమని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో పూజలు చేసేవారికి ఈశ్వరానుగ్రహం లభిస్తుందని వారు చెప్తున్నారు. అంతేగాకుండా.. పరమేశ్వరుడే స్వయంగా శ్రావణ మాసం తనకు ప్రీత

శ్రావణ మాసంలో ఆకుకూరలు తినకూడదట..
, శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (13:00 IST)
శ్రావణ మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైన మాసమని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో పూజలు చేసేవారికి ఈశ్వరానుగ్రహం లభిస్తుందని వారు చెప్తున్నారు. అంతేగాకుండా.. పరమేశ్వరుడే స్వయంగా శ్రావణ మాసం తనకు ప్రీతికరమని చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో తనను పూజించే వారి కోరికలు నెరవేరుతాయని ఈశ్వరుడే చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
కోరికలు లేకుండా పూజించినా వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ మాసంలో తిథి, వారము, వ్రత ప్రాముఖ్యత లేదు. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈ మాసం గురించి పరమేశ్వరుడు చెప్తూ.. ఎవరైతే శ్రావణ మాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ.. ఇంద్రియ నిగ్రహంతో గడుపుతారో వారికి అన్నీ తీర్థాల్లో స్నానమాచరించిన పుణ్య ఫలం దక్కుతుంది. వారికి వంశాభివృద్ధి వుంటుంది. 
 
ఈ నెలలో దైవకార్యాలు స్వల్పంగా చేసినా సరే అనంత ఫలితాలను ఇస్తాయి. మాసమంతా వ్రతం చేయదలచిన వారు భూశయనం, బ్రహ్మచర్యం పాటిస్తూ.. సత్యాన్ని పలకాలి. అరటి ఆకులోనే భోజనం చేయాలి. ఆకుకూరలు తినకూడదు. శ్రావణ మాసంలో చేసే నమస్కారాలు, ప్రదక్షిణలు వేల రెట్ల ఫలితాన్నిస్తాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినాయకుని ''చింతామణి గణపతి'' అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?