Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వడం వాస్తవమే : యాంకర్ సుమ

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (14:30 IST)
ప్రముఖ యాంకర్ సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్‌లో ఎంతో బిజీగా ఉంది యాంకర్ సుమ. ఈ క్రమంలోనే ఇక ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొంది. 
 
సాధారణం గానే సుమ కెరీర్ వెండితెరపై హీరోయిన్‌గా మొదలైంది. తరువాత రాజీవ్ కనకాలతో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే కుటుంబ బాధ్యతల కారణంగా ఇక వెండితెరకు దూరం అయింది.
 
కానీ కొన్నాళ్ళకి బుల్లితెరపై యాంకర్‌గా ప్రత్యక్షమై ఇక అలాగే సెట్ అయి పోయింది యాంకర్ సుమ. ఇక ఇప్పుడు ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్లీ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమం లోనే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై రావడానికి కారణం ఏంటి ఎవరిలా మారాలి అనుకుంటున్నారు అని అడుగగా.. అనుష్క సమంత రమ్యకృష్ణ రష్మిక మందన్న లాగా హీరోయిన్‌గా మారాలి అనుకుంటున్నాను అంటూ సరదా సమాధానం చెప్పింది యాంకర్ సుమ. 
 
దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా విశేషాలను ఎన్నో పంచుకుంది. ఆలీతో సరదాగా కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారి పోయింది. ఇకపోతే ఇక తాను నటించిన జయమ్మ పంచాయతీ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనతో కూడా ఒక పాట పాడేలా చేశాడు అంటూ అభిమానులకు తెలియని సరికొత్త విషయాన్ని చెప్పింది. అంతే కాదు ఆ పాటని పాడి కూడా వినిపించింది.
 
గతంలో సుమ, రాజీవ్ మధ్య గొడవలు అయ్యాయని, వారు విడిపోవాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు వాటిపై సుమ కానీ, రాజీవ్ కానీ స్పందించలేదు. తాజాగా ఈ ప్రోగ్రాంలో ఆలీ దాని గురించి సుమని అడిగాడు.
 
సుమ దీనికి సమాధానమిస్తూ.. "అవును, మా ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వడం వాస్తవమే. ఈ 23 ఏళ్లలో చాలా గొడవలు అయ్యాయి. భార్య భర్తలుగా విడాకులు తీసుకోవడం ఈజీనే, కానీ పేరెంట్స్‌గా మాత్రం చాలా కష్టం" అని తెలిపింది. అయితే ప్రోమోలో దీనికి కొంచెమే చూపించినట్లు తెలుస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న గొడవల గురించి తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments