Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుమ కనకాల జయమ్మ పంచాయతీ తేదీ ఖ‌రారు

సుమ కనకాల  జయమ్మ పంచాయతీ  తేదీ ఖ‌రారు
, సోమవారం, 14 మార్చి 2022 (10:22 IST)
Jayamma- Suma
ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల న‌టించిన తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ` విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సమ్మర్‌లో వచ్చే  సినిమాల‌ను చూసుకుని  చివరకు ఏప్రిల్ 22తో విడుద‌ల‌కు ఫిక్స్ అయిన ఓ ఆహ్లాద‌ర‌క‌ర‌మైన వీడియో ద్వారా వారు తేదీని ప్రకటించారు.
 
విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ పల్లెటూరి డ్రామా చిత్రం టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది. వారు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో ముందుకు రావడం ద్వారా ప్రమోషన్‌లను చేస్తున్నారు.
 
ఇటీవ‌లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను కూడా ఆవిష్క‌రించారు.
 
ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ నటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనుష్క కుమార్ సినిమాటోగ్రాఫర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఆఫ్రికన్ హక్కులను పొందిన శ్రేయాస్ మీడియా