Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు ఒక స్నేహితుడు - తండ్రి కంటే గొప్ప.. బాలయ్యపై హీరో భార్య పొగడ్తలు (video)

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (09:52 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నందమూరి హీరో తారకరత్న గత నెలలో చనిపోయారు. గుండె సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయన కుప్పంలో తీవ్ర అస్వస్థతకు లోనై ఫిబ్రవరి 22వ తేదీన బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ తర్వాత తారకరత్న కుటుంబానికి హీరో నందమూరి బాలకృష్ణ పెద్ద దిక్కు అయ్యారు. అన్నీ తానై చూసుకుంటున్నారు. తారకరత్నపై తనకున్న ప్రేమకు గుర్తుగా తన ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రిలోని ఒక వార్డుకు తారకరత్న పేరును పెట్టారు. దీనిపై తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీనిపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
 
"నేను ఏమి చెప్పగలను. మీకు నా కృతజ్ఞతలను ఎలా తెలియజేయగలను. మీ గురించి ఏది చెప్పినా తక్కువే అవుతుంది. బంగారు హృదయం కలిగిన గొప్ప వ్యక్తి అని చెప్పడం ఎంతమాత్రం ఆశ్చర్యం కాదు. మీకు ఎవరూ సాటికాదు. మీరు ఒక స్నేహితుడు, తండ్రి కంటే ఎక్కువ. ఇపుడు మీలో దేవుడుని చూసుకుంటున్నాను. మీ మంచితనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నా హృదయాంతరాల్లో నుంచి మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో.. అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని మేం ప్రేమిస్తున్నాం. జై బాలయ్య" అంటూ ఎంతో భావోద్వేగతంగా ఆమె స్పందించారు. ఆ పోస్ట్ కింద అఖండ సినిమాలో అఘోరా రూపంలో ఉన్న బాలయ్య ఫోటోను షేర్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments