సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోమారు తన పెద్ద మనసును, పెద్దరికాన్ని చూపించారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రిలో గుండె సమస్యతో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా వైద్యం చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వార్డును కూడా రూపొందించారు. ఆ హీరో ఎవరో కాదు. నందమూరి తారకరత్న. గత నెల 22వ తేదీన గుండెపోటుతో చనిపోయారు. మరణాంతరం అన్ని కార్యక్రమాలను బాలయ్య దగ్గరుండి తానే చూసుకున్నారు. ఇపుడు తారకరత్న కుటుంబానికి ఆయనే పెద్ద దిక్కుగా మారారు.
తారకరత్న భార్యాపిల్లలకు మీకు నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పారు. వారికి అండగా నిలబడ్డారు. మరోవైపు, తారకరత్న జ్ఞాపకార్థం తన ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం ఆస్పత్రిలో ఒక వార్డుకు తారకరత్న పేరును పెట్టారు. గుండె సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఈ వార్డులో ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్టు ప్రకటించారు. బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తూ, బాలయ్యది పెద్ద మనస్సు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.