Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అల్లాద్దీన్' ప్లాన్ వ‌ర్కౌట్ అవుతుందా..?

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (18:23 IST)
ఇటీవలే డిస్నీ సంస్థ మర్వెల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన "అవెంజర్స్ ఎండ్‌గేమ్". ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టించింది. అభిమానులు అవెంజర్స్ మ్యానియా నుంచి బయటకి రాకుండానే డిస్నీ సంస్థ "అల్లాద్దీన్" వంటి మరో అద్భుతమైన సినిమాను ఈ నెల‌ 24న దాదాపు 350 థియేటర్స్‌లో విడుదల చేశారు. 
 
ఈ చిత్రం భారత్‌లో భారీగా రిలీజ్ అవ్వడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో కూడా విడుదల అవుతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ అల్లాద్దీన్ తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వడం విశేషం. అలాగే అల్లాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. 
 
ఇటీవలే దీనికి సంబంధించిన తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు. వెంకీ, వ‌రుణ్ తేజ్ న‌టించిన "ఎఫ్ 2" సినిమా సంచ‌ల‌నం సృష్టించ‌డంతో వీరిద్ద‌రితో డ‌బ్బింగ్ చెప్పిస్తే.. సినిమా ఆడియ‌న్స్‌కి బాగా రీచ్ అవుతుంద‌నే ఉద్దేశ్యంతో డ‌బ్బింగ్ చెప్పించార‌ట‌.
 
 ఈ సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించాడు. ఇక అల్లాద్దీన్‌గా మేనా మసూద్ యాక్ట్ చేసాడు. మొత్తంగా వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ‘అల్లాద్దీన్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు డ‌బ్బింగ్ చెప్పించ‌డంతో మంచి క్రేజ్ వచ్చింది.  మ‌రి..సినిమా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments