Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ జైత్రయాత్ర ఆధారంగా "యాత్ర" మూవీ సీక్వెల్

Advertiesment
Yatra Movie Sequel
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాకి మహి.వి.రాఘవ దర్శకత్వం వహించగా, మలయాళ స్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ జగన్ ఘన విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడట దర్శకుడు.
 
2019 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు జరిగిన పరిణామాలు, జగన్ పాదయాత్రను ఆధారం చేసుకుని ‘యాత్ర 2’ పేరుతో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ జగన్‌కి శుభాకాంక్షలు తెలియజేసాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద‌ర్శ‌కేంద్రుడు అలాంటి సినిమాని ప్లాన్ చేస్తున్నారా..?