అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి మూవీ ఏజెంట్ సంక్రాంతికి రాబోతుంది

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (19:10 IST)
Akhil Akkineni
డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల భారీ అంచనాలున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఏజెంట్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఏజెంట్ 2023 సంక్రాంతికి విడుదల కానుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.  
 
గూఢచారిగా యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించబోతున్న ఈ చిత్రం కోసం అఖిల్ మేకోవర్ అద్భుతంగా వుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అఖిల్ సూట్‌లో స్లిక్ అండ్ మోడరన్ గా ఆకట్టుకున్నాడు. అఖిల్ స్టైలిష్ అండ్ డైనమిక్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమా టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత భారీగా పెరిగాయి.
 
సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తుండగా, మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమరామెన్ గా హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌ టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు
 
 అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments