లోన్ యాప్‌ల ఆగడాలకు ఇప్పటికే కొందరు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వుండేందుకు ఏపీలోని వైకాపా సర్కారు నడుం బిగించింది.
లోన్ యాప్‌లపై ఫిర్యాదుల కోసం కొత్తగా టోల్ ఫ్రీ నెంబరు తీసుకువచ్చింది. లోన్ యాప్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.
బ్యాంకు ఖాతాల వివరాలు, పిన్ నెంబరు, ఆధార్, ఓటీపీ వివరాలను, ఫొటోలను తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దని సూచించింది. ఈ మేరకు ఏపీ హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది.