Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోన్ యాప్ సిబ్బంది వేధింపులు... ఇంట్లోనే ఉరేసుకున్న బాధితుడు

suicide
, సోమవారం, 24 అక్టోబరు 2022 (13:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో లోన్ యాప్ సిబ్బంది వేధింపులకు మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తన ఇంట్లోని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదీకూడా పండగనాడే ఇంట్లో ఉరేసుకుని తనవు చాలించాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగింది. 
 
కొత్తకోటకు చెందిన శేఖర్ అనే యువకుడు గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ముఖ్యంగా అత్యవసరంగా డబ్బులు కావాల్సిరావడంతో లోన్ యాప్‌ను ఆశ్రయించాడు. వారి నుంచి సొమ్ము తీసుకుని వాడుకున్నాడు. అవరం తీరిన తర్వాత వడ్డీ డబ్బులతో కలిపి లోన్ యాప్ సంస్థకు తిరిగి చెల్లించాడు. 
 
తీసుకున్న సొమ్ము మొత్త చెల్లించినా లోన్ యాప్ నిర్వాహకుల నుంచి శేఖర్‌కు వేధింపులు ఆగలేదు కదా మరింతగా ఎక్కువయ్యాయి. వడ్డీల పేరుతో ఇంకా బాకీవుందని వరుసబెట్టి ఫోన్లు, మెసేజ్‌లు ఇస్తూ వేధించారు. బాకీ ఉన్న సొమ్ము మొత్తం తక్షణం చెల్లించని పక్షంలో ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. 
 
దీంతో వాళ్లు అడిగిన సొమ్ము చెల్లించేందుకు శేఖర్ సిద్ధపడ్డాడు. డబ్బుల కోసం ప్రయత్నిస్తుండగానే లోన్ యాప్ నిర్వాహకులు శేఖర్ ఫోటోలు మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించారు. ఆపై వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వీటిని చూసి తీవ్ర మనస్తాపానికి లోనైన శేఖర్ సోమవారం ఉదయం ఇంట్లోని తన గదిలో ఉరేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిష్క్రమించిన నైరుతి రుతుపవనాలు : వాతావరణ శాఖ వెల్లడి