Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహ‌న్‌బాబు త‌ర్వాత వారికే రుణ‌ప‌డి వుంటాః బెల్లంకొండ సురేష్‌

మోహ‌న్‌బాబు త‌ర్వాత వారికే రుణ‌ప‌డి వుంటాః బెల్లంకొండ సురేష్‌
Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (17:36 IST)
Bellamkonda Suresh, Ganesh, Laxman K. Krishna
సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'స్వాతిముత్యం'. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని చ‌విచూసింది. 
 
ఈ సంద‌ర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, ద‌స‌రా పండుగ‌నాడు విడుద‌లై మొద‌టి రెండు రోజులు క‌లెక్ష‌న్లు మంద‌కొడిగా వున్నా మూడోరోజు శుక్ర‌వారం నుంచి నేడే విడుద‌ల అన్నంత రేంజ్‌తో అనూహ్యంగా క‌లెక్ష‌న్లు పెరిగాయి. అలా రోజురోజుకూ పెరుగుతూ వుండ‌డం చాలా ఆనందంగా వుంది. మంచి క‌థ వుంటే ప్రేక్ష‌కులు ఆదరిస్తార‌నేందుకు ఈ సినిమానే నిద‌ర్శ‌నం. ఇటువంటి సినిమాను నిర్మించిన సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వంశీగారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఒక‌వైపు వ‌ర్షాలు, మ‌రోవైపు పెద్ద హీరోల చిత్రాల న‌డుమ స్వాతిముత్యం విడుద‌ల‌యినా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొంద‌డం అదృష్టంగా భావిస్తున్నాను.
 
ఈ సినిమాలో మంచి క‌థ‌, సీనియ‌ర్ న‌టీన‌టులు చేయ‌డం లాభించింది. మా అబ్బాయి గ‌ణేష్ మొద‌టి సినిమా అయినా సీనియ‌ర్స్‌తో చేయ‌డం అందులోనూ మంచి క‌థ‌తో రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. నేను నిర్మాత‌యినా ఇంత మంచి క‌థ‌ను తీయ‌లేనేమో. అలాంటి చిన్న‌బాబు, నాగ‌వంశీ సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో తీసి స‌క్సెస్ ఇచ్చారు. మా గురువులు మోహ‌న్‌బాబు త‌ర్వాత ఈ సినిమా నిర్మాత‌ల‌కు జీవితాంతం రుణ‌ప‌డి వుంటాను. ద‌ర్శ‌కుడు చిన్న ఎమోష‌న్స్‌ను హిలేరియ‌స్ కామెడీగా చూపించారు. న‌టుడు గోప‌రాజు క్ల‌యిమాక్స్‌లో `పిల్ల‌లు లేని వారికి తెలుసురా ఆ బాధేమిటో.. ఆ స‌రోగ‌సీఏమిటో..` అంటూ డైలాగ్ ఎమోష‌న్‌తో క‌ట్టిప‌డేశాడు.ద‌ర్శ‌కుడు దానిని బాగా తీయ‌గ‌లిగాడు. ఈ సంద‌ర్భంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు, ఓవ‌ర్‌సీస్‌వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. సెకండ్ వీక్ నుంచి క‌లెక్ష‌న్లు పెర‌గ‌డం జ‌రిగింది. ఈ విజ‌యం జ‌న్మ‌లో మ‌ర్చిపోలేను అని తెలిపారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ,  త్రివిక్ర‌మ్ గారు సినిమా చూసి, రిపీట్ ఆడియ‌న్స్ వ‌స్తారు అంటూ ఆయ‌న చెప్పిన మాట నిజ‌మ‌యింది. బెల్లంకొండ సురేష్‌గారు నా క‌థ‌విన్నాక నువ్వే చేయ‌గ‌ల‌వ‌ని నీకు ఆ స‌త్తావుందంటూ నేను తీసిన షార్ట్ ఫిలిం చూసి మెచ్చుకోవ‌డ‌మేకాక‌, తెలిసిన‌వారంద‌రికీ నా షాట్ ఫిలిం గురించి చెప్ప‌డం నాకు మ‌రింత ధైర్యం క‌లిగించారు. ముందుగా ఈ క‌థ‌పై పూర్తి న‌మ్మ‌కంతో నాగ‌వంశీగారు వున్నారు. ఆయ‌న అనుకున్న‌ట్లే హిట్ అయింది అని చెప్పారు.
 
గ‌ణేష్ మాట్లాడుతూ, మంచి సినిమా తీస్తే ప్రేక్ష‌కులు చూస్తార‌ని నిరూపించారు. పెద్ద సినిమాల మ‌ధ్య‌లో మా చిన్న సినిమానూ చూసి మెచ్చుకున్నారు. నటుడిగా పేరు వ‌చ్చింది. ఈ అవ‌కాశం ఇచ్చిన సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌కూ, నాగ‌వంశీగారికి, చిన్న‌బాబుగారికి, ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

Pawan Kalyan: దళితులను అవమానిస్తే ఎదురు తిరగండి.. ఓజీ ఓజీ ఏంటి.. పక్కకు పో...(video)

ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి దాడి.. చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొడుతూ.. సీఐకి సెల్యూట్ (వీడియో)

Hyderabad: బస్టాప్‌లో గంజాయి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం
Show comments