Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వాతిముత్యం గురించి, మ‌హేష్‌బాబు, చిరంజీవి చిత్రాల గురించి వెల్ల‌డించిన నిర్మాత నాగవంశీ

Producer Nagavanshi
, శనివారం, 1 అక్టోబరు 2022 (15:53 IST)
Producer Nagavanshi
`గాడ్ ఫాదర్,  ది ఘోస్ట్ సినిమాలతో పాటు స్వాతిముత్యం చిత్రం విడుదల చేస్తున్నాం. దానికి కార‌ణం ఏమంటే,  కోవిడ్ తర్వాత ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. పైగా దసరా సీజన్ కాబట్టి రెండు సినిమాలున్నా రిస్క్ తీసుకుంటున్నాం` అని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలియ‌జేశారు. 
 
'ప్రేమమ్', 'జెర్సీ', 'భీష్మ', 'డీజే టిల్లు', 'భీమ్లా నాయక్' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తోన్న తాజా చిత్రం 'స్వాతిముత్యం'. యువ ప్రతిభను పరిచయం చేస్తూ సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ వినోదభరితమైన కుటుంబకథా చిత్రంలో గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించారు. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజాగా విలేకర్లతో ప‌లు విశేషాలను పంచుకున్నారు.
 
స్వాతిముత్యం ఎలా ఉండబోతోంది?
ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. థియేటర్ నుంచి నిస్సందేహంగా  నవ్వుకుంటూ బయటకు వస్తారు. అద్భుతం తీశాం, అవార్డులు వచ్చే సినిమా తీశామని చెప్పను. పండగ రోజు థియేటర్ కి వస్తే మాత్రం గ్యారంటీగా నవ్వుకునే బయటకు వస్తారు. అయితే ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఇందులో టచ్ చేశాం. ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ని ఫన్ టోన్ లో చెప్పాం. 
 
మొన్న చిరంజీవి గారు మీ సినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు కదా.. మీరెలా ఫీల్ అయ్యారు?
అందుకే ఆయన చిరంజీవి అయ్యారు. చిన్న సినిమాలను ఆదరించమని కోరతారు. చిన్న సినిమాలను అభినందిస్తారు. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అయ్యారు.
 
ఈ టైటిల్ పెట్టడానికి కారణమేంటి? టైటిల్ పెట్టేముందు బాగా ఆలోచించారా?
హీరో క్యారెక్టర్ అమాయకంగా ఉంటుంది కాబట్టి స్వాతిముత్యం టైటిల్ సరిగ్గా సరిపోతుందని పెట్టాం. పైగా చిన్న సినిమాకి క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెడితే మా సినిమా ప్రేక్షకులలోకి త్వరగా వెళ్తుందన్న ఉద్దేశంతో పెట్టాం. అయితే సినిమా చూశాక ఇది యాప్ట్ టైటిల్ అని అందరికీ అనిపిస్తుంది.
 
స్వాతిముత్యం అంటే అమాయకుడా? పిచ్చోడా?
పిచ్చోడు కాదు అమాయకుడు. ఈ జనరేషన్ లో ఉండాల్సిన వాడు కాదు. చాలా మంచోడు. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో హీరోలా ఉంటాడు.
 
కొంతకాలంగా ప్రేక్షకులు వైవిధ్యమైన చిత్రాలనే ఆదరిస్తున్నారు? మీ చిత్రం ఆదరణ పొందుతుంది అనుకుంటున్నారా?
బింబిసార, సీతారామం, కార్తికేయ -2 వేటికవే విభిన్న చిత్రాలు. అన్నీ ఆదరణ పొందాయి. అలాగే ఇటీవల ఎంటర్టైన్మెంట్ సినిమాలు పెద్దగా రాలేదు. డీజే టిల్లు తర్వాత ఇదే అనుకుంటున్నా. అలా అని కేవలం ఎంటర్టైనర్ మాత్రమే కాదు కొత్త కాన్సెప్ట్ కూడా ఉంటుంది.
 
వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా ఎంపిక చేయడానికి కారణం?
మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ఆమె నటన చూసి ఎంపిక చేశాం. దీనిలో కూడా ఒక స్మాల్ టౌన్ అమ్మాయి  క్యారెక్టర్. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుంది అని ఎంపిక చేయడం జరిగింది.
 
ఈ ఫిల్మ్ గణేష్ కి మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నారా?
బెల్లంకొండ సురేష్ గారు పెద్దబ్బాయిని సమంతను హీరోయిన్ గా పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇది అలా కాదు. ఈ సినిమాతో మంచి కాన్సెప్ట్ తో వచ్చాడన్న పేరు వస్తుంది.
 
స్వాతిముత్యం నుంచి ఇక సితారలో ప్రయోగాత్మక చిత్రాలు ఆశించవచ్చా?
డీజే టిల్లు నుంచే చేశాం కదా. అన్ని రకాలు చిత్రాలు చేస్తాం. టిల్లు, వరుడు కావలెను, స్వాతిముత్యం ఇలా చిన్న చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాం. అలాగే బాలకృష్ణ, రవితేజ, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాం. అలాగే ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో తారక్  బావమరిదిని లాంచ్ చేస్తున్నాం. 
 
చిరంజీవి గారితో ఎప్పుడు ఉండొచ్చు ప్రాజెక్ట్?
నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను ఆయనతో త్వరగా సినిమా చేయాలని.
 
మహేష్ బాబు గారి సినిమా గురించి చెప్తారా?
త్రివిక్రమ్, మహేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు థియేటర్స్ లో రావాల్సినంత ఆదరణ రాలేదు. కానీ టీవీల్లో పిచ్చి పిచ్చిగా చూసి ఆ కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకొని థియేటర్ కి వచ్చినా అంతకుమించి మెప్పించేలా ఈ సినిమా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవిష్ణుకు జోడీగా రెబా మోనికా జాన్‌