Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతికేళ్ల తర్వాత వ‌స్తున్న‌ జాతీయ ఉత్తమ నటి అర్చన

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (16:34 IST)
Archana
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా `చోర్ బజార్`. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న`చోర్ బజార్` సినిమా నుంచి ఒక్కొక్కటిగా హైలైట్స్ రివీల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు.
 
ఇంగ్లీష్, బెంగాళీ సహా అన్ని ప్రధాన భారతీయ భాషా చిత్రాల్లో దశాబ్దాల కెరీర్ సాగించింది అర్చన. వీడు చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కించుకుంది. తెలుగులో ఆమె నటించిన నిరీక్షణ, భారత్ బంద్, లేడీస్ టైలర్ లాంటి చిత్రాలను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. చోర్ బజార్ చిత్రంతో 25 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపైకి వస్తోంది అర్చన. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది.
 
ఈ సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
 
సాంకేతిక నిపుణులు - సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి, సంగీతం - సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ - అన్వర్ అలీ,ప్రభు దేవ‌, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం,  సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి. ఆడియో - లహరి, కాస్ట్యూమ్స్ డిజైనర్ - ప్రసన్న దంతులూరి, ఫైట్స్ - ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ - భాను, పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను ,  స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో - జీఎస్కే మీడియా,  మేకప్ - శివ, కాస్ట్యూమ్ చీఫ్ - లోకేష్, డిజిటల్ మీడియా - వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత - అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ - ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత - వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం - బి. జీవన్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments